చలికి తట్టుకోలేక పోలీస్ క్యాంప్‌లోకి దూరింది కోతి.. నెక్స్ట్ ఏం జరిగిందో తెలిస్తే...

భారతదేశంలో ప్రస్తుతం వింటర్ సీజన్( Winter ) నడుస్తోంది.ఈ కాలంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు మనుషులనే కాదు మూగ జంతువులను కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.

 Viral Video Monkey Enters Police Camp And Sits In Front Of Heater To Keep Warm I-TeluguStop.com

ఈ శీతాకాలంలో వెచ్చదనం కోసం మూగ జంతువులు పాకులాడుతున్నాయి.కొన్ని ఈ చలిలోనే వణుకుతూ నరకం అనుభవిస్తున్నాయి.

తాజాగా ఒక కోతి( Monkey ) చలికి తట్టుకోలేక వెచ్చదనం కోసం ఉత్తరప్రదేశ్ పోలీసు కమిషనర్ పోలీస్ క్యాంప్‌లోకి( Police Camp ) దూరింది.

అయితే పోలీస్ అధికారులు దానిని చూసి వెళ్ళగొట్టలేదు.అందుకు బదులుగా ఆ కోతిని హీటర్( Heater ) ముందు కూర్చోబెట్టారు.అప్పుడు కోతి వెచ్చదనం పొందుతూ ఉపశమనం పొందింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ హార్ట్ టచింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది చూసి చాలామంది పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.వీరు చేసిన పని మనసును హత్తుకునేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

వీడియోలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ అశోక్ కుమార్ గుప్తా( SI Ashok Kumar Gupta ) హీటర్ ముందు సైలెంట్‌గా కూర్చొని ఉన్న కోతిని దువ్వుతూ ఉండటం మనం చూడవచ్చు.ఆ కోతి హీటర్ ముందే తిరుగుతూ ఉండటం కూడా గమనించవచ్చు.కొద్దిసేపటికి కోతి చాలా ప్రశాంతంగా గోల చేయకుండా క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి వెళ్లిపోయింది.కోతి పట్ల పోలీసులు చూపించిన మానవత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.పోలీసులు జంతువులను కాపాడిన సంఘటనలు మరి కొంతమంది గుర్తు తెచ్చుకున్నారు.పాములను కూడా కాపాడే మంచి పోలీస్ అధికారులు ఇండియాలో ఉన్నారని ఇంటర్నెట్ యూజర్లు కామెంట్లు చేశారు.

ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో మూగ జంతువులను ఆదుకోవాలని మరికొందరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ వీడియోను మీరు కూడా చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube