Viral Video: సంప్రదాయం పేరుతో భర్త కళ్ల ముందే భార్యను వేధించిన అల్లరి ముఖా..!

భారతదేశంలో చిన్న, పెద్ద, కులం, మతం అని తేడా లేకుండా అందరూ చేసుకునే పండగలలో హోలీ పండుగ( Holi Festival ) ముందు వరుసలో ఉంటుంది.పండగ రోజు అందరూ కలిసి రంగులను ఒకరికి ఒకరు పూసుకుంటూ కేరింతలు కొడుతూ రోజును ఎంజాయ్ చేస్తారు.

 Viral Video Boys Pouring Water On Woman At Manikarnika Ghat Varanasi-TeluguStop.com

అయితే కొందరు ఈ పండుగ రోజున వారి ఎంజాయ్ ని మితిమీరి చేయడం వల్ల వారి వల్ల మరొకరు ఇబ్బంది పడుతున్నారు.ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కోవకే ప్రస్తుతం మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోకు సంబంధించిన వివరాలు చూస్తే.


ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో మణికర్ణిక ఘాట్( Manikarnika Ghat Varanasi ) వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద కొంతమంది ఆకతాయిలు యువ జంటను వేధింపులకు గురి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.హోలీ పండుగ రోజు యువ జంట మణికర్ణిక ఘాట్ పై వెళ్తుండగా అందులో భార్యపై కొందరు ఆకతాయిలు భర్త ముందే రంగు నీళ్లు( Color Water ) చల్లారు.అయితే అలా చేయొద్దని ఆ జంట ఎంత కోరుకున్న ఆకతాయిల వినకుండా వారిపై నీళ్లను చల్లారు.

అదే సమయంలో అనేకమంది అక్కడ ఉన్నారు.వారందరూ అలా చేయొద్దని చెప్పకుండా ఫోటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా యువజంట( Couple ) భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త లేటుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సంఘటన సంబంధించి కొందరు నెటిజెన్స్ వారణాసి పోలీసులకు( Varanasi Police ) ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు అందించారు.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

అందులో కొందరు సాంప్రదాయం పేరుతో ఇలా చేయడం సరికాదని, అందులో కొందరు సాంప్రదాయం( Culture ) పేరుతో ఇలా అందరూ చూస్తుండగానే భర్త ముందే భార్యను చేయటం ఏంటని.అలాగే పుణ్యక్షేత్రంలో ఇలాంటి పాడు పనులు ఏంటి అని నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube