వైరల్: దురదృష్టవశాత్తు బావిలో పడిన కుక్క... పక్కనే పెద్ద నాగుపాము.. ఏం జరిగిందంటే? 

అనుకోని ప్రమాదాలు మనిషికే కాదు, మిగతా ప్రాణులకు కూడా సంభవిస్తాయి.ప్రాణభయం అనేది ఎవరికైనా ఒక్కటే.

 Viral: Unfortunately, The Dog Fell Into The Well There Was A Big Cobra Next To I-TeluguStop.com

తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఆయా జీవులు పోరాటం చేస్తాయి.తమ పై దాడి చేసేందుకు వచ్చిన జంతువులకు ఎదురు తిరుగుతాయి.

అయితే రెండింటి మధ్య భీకర స్థాయిలో పోరు జరిగినపుడు ఓ ప్రాణి బలికావాల్సిందే.ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ భారీ నాగుపాముతో కుక్క ప్రాణం కాపాడుకోవడానికి యుద్ధమే చేసింది.

వివరాల్లోకి వెళితే, ఓ కుక్క అనుకోకుండా బావిలో పడిపోయింది.

ఇక అందులో నాగుపాము ఉండటంతో కుక్క బిత్తరచూపులు చూసింది.ఆ నాగుపాము.

తన దగ్గరకు చేరకుండా ఉండేందుకు కుక్క శతవిధాల ప్రయత్నించింది.ప్రాణభయంతో ఆ విషసర్పంతో అతి పెద్ద పోరాటమే చేసింది.

కట్ చేస్తే అదే సమయానికి అక్కడి స్థానికులు.కుక్క అరుపులు గుర్తించి.

సాయం అందించారు.సమయానికి స్నేక్ క్యాచర్ కూడా స్పాట్‌కు చేరుకోవడంతో.

ఆ పాము కాటు నుంచి కుక్కను చాకచక్యంగా కాపాడారు.

అలాగే అందులో వున్న నాగుపామును బంధించి.

అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Murliwale Hausla అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అయిన సదరు వీడియోని 85 లక్షలకు పైగా చూడటం కొసమెరుపు.అదే స్థాయిలో లైకులు, కామెంట్లు రావడం కూడా విశేషం.

ఈ సందర్భముగా ఆ స్నేక్ క్యాచర్ ని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

A

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube