వైరల్: డజన్ ఆర్డర్ చేస్తే 12 మాత్రమే వచ్చాయి.. కస్టమర్ రిక్వెస్ట్ కు ఆశ్చర్యపోయిన ఓనర్..

కొంతమంది అతి తెలివి చూస్తుంటే నవ్వు వస్తుంది.అలాంటి వారు వేసే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో కూడా అర్థంకాదు.

 Viral I Order A Dozen Masks But Only 12 Came Owner Surprised By Customer Reques-TeluguStop.com

ఇలాంటి వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటారు.ఇక అలాంటి వారు మనమే చాలా మందికి ఇలాంటి సందర్బాలు ఉంటాయి.

తాజాగా ఓ కస్టమర్ చేసిన పనికి ఆ స్టోర్ యజమాని అవాక్కయ్యాడు.ఇంతకీ ఆ కస్టమర్ ఏం చేసాడో తెలుసుకుందామా.

అమెరికన్ వ్యక్తి ఆన్‏లైన్ ‏లో మిన్నెసోటా లోని ఓ స్టోర్ కు డజన్ మాస్కులను ఆర్డర్ పెట్టాడు.దీంతో ఆ స్టోర్ వాళ్ళు 12 మాస్కులను అతనికి పంపించారు.

అయితే తిరిగి ఆ కస్టమర్ నుంచి స్టోర్ ఓనర్ కు ఓ మెయిల్ వచ్చింది.అంతే అది చూడగానే అతనికి దిమ్మ తిరిగిపోయింది.

ఆ మెయిల్ ‏లో నేను మీకు డజన్ మాస్కులు ఆర్డర్ చేసాను.కానీ మీరు నాకు ప‌న్నెండు మాస్కులు మాత్రమే పంపించారు.

నా డ‌బ్బులు నాకు వాప‌సు ఇవ్వండి.లేదంటే మిగతా మాస్కులు అయినా పంపించండీ’’.

ఇంకా మీరు ఇలా చేస్తే.ఇక నుంచి మీ బిజినెస్‌కు నేను స‌పోర్ట్ ఇవ్వ‌ను.

బ్లాక్ వాళ్లు (నల్లజాతీయులు) న‌డిపే స్టోర్ల‌కు నేను స‌పోర్ట్ ఇద్దామ‌ని అనుకున్నాను.మీరు మాత్రం ప్ర‌జ‌ల‌ను ఇలా దోచుకుంటూనే ఉన్నారు’’ అంటూ మెయిల్ రాశాడు.

దీంతో వెంటనే ఆ స్టోర్ ఓనర్ జాడా మెక్ క్రే.తిరిగి ఆ కస్టమర్‏కు డజను అంటే పన్నెండే కదా.మీకు రీఫండ్ ఇవ్వడం కుదరదు అని మెయిల్ చేశాడు.బిల్లులో కూడా చాలా స్ప‌ష్టంగా ఉంది.12 మాస్క్‌ ల‌కు డ‌బ్బులు తీసుకున్నాము క‌దా అని కూడా ఆమె గుర్తు చేసింది.అది చూసిన క‌స్ట‌మ‌ర్‌.

అవునా, నిజానికి నాకు 20 కావాలి.నేను బిల్లు స‌రిగా చూడ‌లేద‌నుకుంటా అంటూ సమాధానమిచ్చాడు.

ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది చూసిన నెటిజన్లు.

ఇదే కదా అమెరికన్ తెలివంటే.అంటూ.

కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube