టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ప్రస్తుతం బిదిరియల్‌మ్యాన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవుతున్న విషయం తెల్సిందే.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ఈ ఛాలెంజ్‌ను టాలీవుడ్ స్టార్స్‌లో మొదలు పెట్టాడు.
ప్రస్తుతం ఇది ఒకరి నుండి ఒకరికి చాలా దూరం వెళ్లింది.కొరటాల శివ ఈ చాలెంజ్‌ను చేసి తనవంతుగా విజయ్ దేవరకొండతో పాటు ఇతరులను నామినేట్ చేయడం జరిగింది.
విజయ్ దేవరకొండ ఎప్పుడెప్పుడు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇంటి పనులు చేసి వీడియో పెడుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా కొరటాల శివ ఛాలెంజ్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ.
శివ సర్ మా ఇంట్లో మమ్మి నన్ను ఏ పని చేయనివ్వడం లేదు.నేను పని చేస్తే ఆమెకు డబుల్ పని అవుతుందట.
ఇంట్లో నన్ను ఇంకా మ్యాన్‌గా చూడం లేదు.ఇంకా మమ్ములను మమ్మి పిల్లలుగానే చూస్తుంది.
అందుకే ఇంటి పనులు చేయనివ్వడం లేదంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.అయితే ఈ లాక్డౌన్ పీరియడ్‌లో తాను చేస్తున్న పనులు ఏంటీ అనేవి నేను చెప్తానంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.
విజయ్ దేవరకొండ ట్వీట్‌పై నెటిజన్స్ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంటి పని చేసేందుకు చిన్నతనం అయ్యి ఇలాంటి ఫన్నీ ముచ్చట్లు చెబుతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.మరికొందరు మాత్ర విజయ్ దేవరకొండ సమయస్ఫూర్తికి హ్యాట్సాప్ అంటున్నారు.విజయ్ దేవరకొండ ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో ఏం చేస్తున్నాడు అనేది ఆసక్తిగా ఉంది.త్వరలోనే ఆయన నుండి వీడియో వస్తుందని ఆశిద్దాం.