రౌడీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ గా ఎవరు చూస్తారు?

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ( vijay devarakonda ) కి యూత్‌ లో మంచి ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆయన యొక్క అర్జున్‌ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

 Vijay Devarakonda And Parasuram Movie Family Star , Vijay Devarakonda , Family-TeluguStop.com

ఆ రెండు సినిమాలు కూడా యూత్‌ కి బాగా కనెక్ట్‌ అయ్యాయి.అందుకే రౌడీ స్టార్ అంటూ విజయ్‌ దేవరకొండ కి పేరు వచ్చింది.

రౌడీ స్టార్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యం లో వరుసగా యూత్‌ ని టార్గెట్‌ చేసి సినిమా లు చేయడం జరిగింది.కానీ ఈసారి పరశురామ్‌ మాత్రం ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం విజయ్‌ దేవరకొండ సినిమా ను రూపొందించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అందుకే ఈ సినిమా కు దిల్ రాజు ఫ్యామిలీ స్టార్( Dil Raju ) అనే టైటిల్ ను రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పరశురామ్‌ ఎంపిక చేసుకున్న కథ విషయం లో దిల్‌ రాజు చాలా ఆసక్తి గా ఉన్నాడట.అందుకే ఈ సినిమా ను కాస్త రిస్క్‌ అయినా కూడా ఎక్కువ బడ్జెట్‌ తో రూపొందించేందుకు గాను సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందిన ఫ్యామిలీ స్టార్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించేందుకు గాను సిద్ధం అవుతున్నారు.రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మరియు పరశురామ్‌ కాంబోలో గతం లో గీత గోవిందం( Geetha Govindam ) సినిమా వచ్చింది.కనుక ఈ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్‌ అంటున్నారు.కానీ కొందరు యాంటీ ఫ్యాన్స్‌ మాత్రం రౌడీ స్టార్ ని ఎలా ఫ్యామిలీ స్టార్ గా జనాలు చూస్తారు సారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube