కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వరుస ఆఫర్లతో నయనతార( Nayantara ) ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
నయన్ నటించి తాజాగా విడుదలైన అన్నపూరణి సినిమా( Annapoorani Movie ) పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా ఓటీటీలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమాపై పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ తరచూ వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.పెళ్లి తర్వాత సరోగసి విధానంలో నయనతార పిల్లల్ని కనడంపై కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి.
విఘ్నేష్ శివన్( Vignesh Shivan ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎల్.ఐ.సీ( L.I.C Movie ) అనే సినిమా టైటిల్ కు సంబంధించి పలు వివాదాల్లో చిక్కుకుంది.జీవిత భీమా సంస్థ ఎల్.ఐ.సీ నుంచి విఘ్నేష్ శివన్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
అన్నపూరణి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో వేణుస్వామి( Venu Swamy ) నయనతారకు పెళ్లి అచ్చిరాదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.నయన్ తరచూ వివాదాల్లో చిక్కుకోవడంతో ఆమె చెప్పిన మాటలే నిజమయ్యాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నయనతార పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో నయన్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.2024 తర్వాత నయన్ సినీ కెరీర్ అంతమవుతుందని కూడా వేణుస్వామి గతంలో వెల్లడించారు.నయనతార, విఘ్నేష్ శివన్ వివాదాలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ కు మేలు జరుగుతుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.