తెలుగు ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్( Actress Varalakshmi Sarath Kumar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కూడా ఒకటి.
తరచూ ఏదో ఒక విషయంతో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంది.క్రాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇది ఇలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం శబరి( Sabari ).ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తోంది.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు.శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లి దండ్రులు విడిపోయారు.ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను ( Actress Radhika )రెండో పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.
అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ( Chaya ), రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి.ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్‌మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు.ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి.
వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అంటూ ఆమె మండిపడ్డారు.అలాగే ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు.నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని ఆమె అన్నారు.
ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని, షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.