ప్రముఖ ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు అమెరికా కోర్టు భారీ ఊరటను ఇచ్చింది.మానసిక చికిత్సలో ఉపయోగించే ఒక ఔషధం పురుషుల్లో రొమ్ము పెరుగుదలకు కారణమవుతుందని ముందే హెచ్చరించని కారణంపై పెన్సిల్వేనియా కోర్టు జాన్సన్ అండ్ జాన్సన్‌కు సుమారు 8 బిలియన్ డాలర్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం 6.8 మిలియన్ డాలర్ల నష్టపరిహారానికి మాత్రమే కంపెనీ బాధ్యత వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.స్కిజోఫ్రెనియా, బైపోలార్డ్ డిజార్డర్ చికిత్సకు సూచించిన రిస్సర్‌డాల్ అనే ఔషధం తన రోమ్మును పెంచేలా చేసిందని నికోలస్ ముర్రే ఫిలడెల్ఫియా కోర్టును ఆశ్రయించాడు.దీనిపై విచారణ జరిపిన జ్యూరీ గతేడాది అక్టోబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సన్ ఫార్మాస్యూటికల్స్‌ను బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
దీనిపై స్పందించిన జాన్సన్ అండ్ జాన్సన్… కోర్టు ఎక్కువ తీవ్రతగల నష్టపరిహారాన్ని తగ్గించినప్పటికీ అప్పీల్‌కు వెళతామని స్పష్టం చేసింది.సదరు ఔషధాన్ని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను తాము జ్యూరీ ఎదుట సమర్పించలేకపోయామని తెలిపింది.మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే రిస్పర్‌డాల్ దుష్ప్రభావాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలమైనందున పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, మిస్సౌరీ తదితర రాష్ట్రాల్లో జాన్సన్ అండ్ జాన్సన్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి.యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 1993లో పెద్దలకు చికిత్స కోసం రిస్పర్‌డాల్‌ను అనుమతించింది.
దీంతో జాన్సన్ అండ్ జాన్సన్‌కు దీని కారణంగా 2018లో 737 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.