గజనిఈ సినిమా పేరు వినగానే ఏదో తెలియని ఫీల్ కదా ఇందులోని అన్ని పాత్రలు, ప్రతి సీన్, పాటలు మనల్ని ఎంటెర్టైన్ చేస్తూనే ఉంటాయి.అయితే ఈ సినిమాని 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా అని, డైరెక్టర్ మురుగుదాస్ ఎన్నో సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడని, వేరే వేరే హీరోలతో సినిమా మొదలై ఆగిపోయిందని మీరెప్పుడైనా అనుకున్నారా?? అసలు మనందరికి తెలియని గజని సినిమా వెనకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం.
గజని సినిమా కథ రెడీ చేసుకున్నప్పటికే తమిళ్ లో మురుగుదాస్ స్టార్ డైరెక్టర్ అయితే ఈ కథని తెలుగులో మహేష్ బాబుతో తీస్తే అదిరిపోతుందని హైదరాబాద్ వచ్చి ముందు నిర్మాత అల్లు అరవింద్ గారికి కథ చెప్పారట ఆయన ఈ కథ విని బిత్తరపోయారట చాల బాగుంది మనం ఈ సినిమా చేస్తున్నాం కానీ ముందు మహేష్ బాబుగారిని ఒప్పించు అని చెప్పారట.అయితే ఈ కధలో హీరో గుండు చేయించుకోవాలి, డ్రాయర్ మీద నిలబడాలి, మెమరీ లాస్ పేషేంట్ లా యాక్ట్ చేయాలి సో, ఈ కధకు మహేష్ ఓకే చెప్పలేదు ఇక ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో తీద్దామని అనుకున్నారట కానీ అప్పటికే పవన్ జానీ ప్లాప్ తో కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పారట! కానీ అరవింద్ గారు ఈ సినిమా చేస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో ఇక తెలుగులో వర్కౌట్ అవ్వట్లేదని తమిళ్ స్టార్ హీరోల వెంట పడ్డాడు మురుగుదాస్కానీ కమల హస్సన్, విజయ్, అలా నలుగురు అయిదుగు హీరోలు ఒద్దన్నారట.
మొత్తంమీద దాదాపు 10 మంది హీరోలు నో చెప్పకా.మురుగుదాస్ చాలా కృంగిపోయాడట.
అయితే ఆ తర్వాత ఈ సినిమా ఎలాగైనా తెరకెక్కించాలని ఫిక్స్ అయి తన మొదటి సినిమాలో హీరోగా చేసిన అజిత్ కి కథ చెప్పాడట అయనకు ఆ కథ నచ్చడంతో మురుగుదాస్ హమ్మయ్య మొత్తానికి టాప్ హీరో దొరికాడని వెంటనే హీరోయిన్స్ గా ఆసిన్ అండ్ శ్రీయాలను, విల్లన్ గా ప్రకాష్ రాజ్ ని తీసుకొని ఈ సినిమాకి మిరత్తల్ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసాడు మురుగుదాస్ అయితే నాలుగు రోజులు షూటింగ్ అయిపోయాక ఎందుకో ఏమో గాని అజిత్ ఈ సినిమా చేయట్లేదని అనౌన్స్ చేసాడు.ఇక అక్కడితో మురుగుదాస్ మల్లి మొదటికి వచ్చాడు.ఇక అప్పుడప్పుడే తమిళ్ లో ఫ్యాన్స్ అవుతున్న హీరో సూర్యని కలిసి గజని కథ వినిపించాడు.దానికి సూర్య వెంటనే అయ్యయ్యో ఇలాంటి కదా కోసం కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసాను అంటూ మురుగుదాస్ కి మొత్తం డేట్స్ ఇచ్చేసాడు.
అంతేకాదు మెమొరీలాస్ పేషంట్స్ దగ్గరకు వెళ్లి వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఎలా బెహేవ్ చేస్తున్నారు ఇలా చాల హోమ్ వర్క్ చేసాడు.ఇంకా గుండు కొట్టించుకొని మొత్తం పచ్చబొట్లు పొడిపించుకొని కొన్ని స్టిల్స్ లో తనని తాను టెస్ట్ చేసుకున్నాడు.క్యారెక్టర్ కి అనుగుణంగా సినిమాకి తగ్గట్టుగా మారాడు.అయితే అప్పటికే శ్రీయ అండ్ ప్రకాష్ రాజ్ డేట్స్ అయిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో నయనతారాని, ప్రదీప్ రావత్ కి అవకాశం ఇచ్చారు.
అలా మళ్ళీ 2005 లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.దీని బడ్జెట్ 10 కోట్లు.పక్కా ప్లాన్ తో ఈ సినిమాని 90 రోజుల్లో ఫినిష్ చేసాడు మురుగుదాస్.ముందు నయనతారకి ప్రతేకంగా ఎలాంటి సాంగ్స్ రాయకపోయినా మురుగుదాస్ ఒక ప్రత్యేకమైన పాట చేద్దామని మొత్తం షూటింగ్ అయిపోయాక చేసారు.
అయితే ఆ పాట ఈ సినిమాలోనే హైలెట్.
ఇకపోతే ఇందులో హీరోయిన్ పేరు కల్పనా అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ మహిళా కల్పనా పేరుని హీరోయిన్ కి పెట్టారు.తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని 2005 సెప్టెంబర్ 29న విడుదలైన ఈ గజిని సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో మనందరికీ తెలిసిందే.మామూలుగా గజిని అనే టైటిల్ ఈ పోస్టర్స్ లో సగం గుండుతో ఉన్న హీరో ని చూసి ఒక మాదిరి అంచనాలతో సినిమాకి వెళ్ళిన ప్రేక్షకులు బిత్తరపోయేలా ఉంది ఈ గజని సినిమా.
పదిహేను నిమిషాలకి తన గతాన్ని మర్చి పోయే హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి.అదే ఈ సినిమాని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.
అలా ఈ సినిమాలో హీరోని కాదు అదిరిపోయే లవ్ స్టోరీ ఉంది మంచి కథ కథనం ఉంది.m సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు.
ఇక ఈ సినిమా సంగీత అయితే అప్పట్లో ఒక ఊపు ఊపింది.మ్యూజిక్ డైరెక్టర్ యావన్ శంకర్ రాజా గారికి మంచి పేరు వచ్చింది.
మరీ ముఖ్యంగా “హృదయం ఎక్కడున్నది” పాట అయితే ఇప్పటికీ అందరి సూపర్ డూపర్ హిట్ లిస్టులో నిలిచిపోయింది.
ఇక ఎన్నో కష్టాలు పడి ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సౌత్ లోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మురుగుదాస్ గారు నిలిచిపోయారు.
ఈ సినిమాను రిజెక్ట్ చేసిన అందరు హీరోలు సిగ్గుపడేలా ఈ సినిమా హిట్ అయింది.ఇక హీరో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి.ఆయన ఈ సినిమాకు చేసిన హోంవర్క్ అంతా ఇంతా కాదు.ప్రతీ సీన్ లోనూ లీనమై నటించాలంటే అది మామూలు విషయం కాదు.
మెమొరీ లాస్ పేషెంట్గా, ఒక టాప్ బిజినెస్ మెన్ గా, ఒక మంచి ప్రేమికుడిగా ఆయన నటన వర్ణించలేనిది.అలా ఈ ఒక్క సినిమాతో అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచిపోయాడు సూర్య.
అదండీ ఈ సినిమా వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
.