గాయత్రి గుప్తా పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు అనుకుంట.గాయత్రి గుప్తా ఒక తెలుగు భాషా నటి, టీవీ ప్రెజెంటర్.
కొన్ని సినిమాల్లో కూడా నటించింది.అయితే ఆమె టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ గురించి తెలుగు న్యూస్ ఛానల్స్ లో చర్చలకు ప్రసిద్ది చెందింది.
అలా గాయత్రి గుప్తా పేరు బాగా పాపులర్ అయింది.ఆమె ఏది మాట్లాడిన, ఏది చేసినాగాని సూటిగా స్పష్టంగా ఉంటుంది.
ఇకపోతే గాయత్రి గుప్తా తెలంగాణ రాష్టంలోని సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట అనే ఊరులో జన్మించారు.ఆమె తల్లి తండ్రులు చాలా కాలం క్రితమే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇక తల్లి అమెరికాలో ఉంటుంది.ఐదుగురు కుమార్తెలలో ఈమె పెద్దది.
అంటే గాయత్రి గుప్తా మొదటి కూతురు.ఈమెకి నలుగురు చెల్లెళ్లు కూడా ఉన్నారు.
ఒక చెల్లి బోర్డర్ లో ఉన్నారట.మరొక చెల్లి బాడీ బిల్డర్, అలాగే ఇంకో చెల్లి సినిమా రంగంలోనే ఉంది.
ఒక చెల్లికి వివాహం జరిగిందట.గాయత్రి గుప్తా నల్గోండలో ఇంజనీరింగ్ చదివింది.
టాలీవుడ్లో కెరీర్ కొనసాగించడానికి గాయత్రి గుప్తా హైదరాబాద్ వెళ్లారు.
ఆమె 2006 లో సాక్షి టీవీలో తన వృత్తిని ప్రారంభించింది.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది.కానీ గుర్తింపు తెచ్చిన చిత్రం ఏంటంటే శేఖర్ కమ్ముల రూపొందించిన ‘ఫిదా’సినిమా.
ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది గాయత్రి గుప్తా ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకుంది.అంతకుముందు లఘు చిత్రంతో ఆమె ప్రాచుర్యం పొందింది.
తరువాత ఐస్ క్రీమ్ 2 చిత్రాలలో నటించిన తరువాత గుప్తా ఖ్యాతిని పొందారు.ఒక తెలుగు చిత్ర నిర్మాత తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వారి సినిమాను అంగీకరించిన తర్వాత లైంగిక సహాయం కూడా కోరినట్లు ఆమె ఆరోపించింది.
అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో చెబుతున్నానని.అయితే అందులో చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే ఆ పని చేస్తున్నపుడు కాదనడానికి మనమెవరం అంటుంది గాయత్రి.
ఈ మాటలు అప్పట్లో బాగానే దుమారం లేపాయి.అలాగే మరికొందరు అవసరాల కోసం చేస్తున్నారు.
కానీ, అందులో చాలా వరకు అమాయకపు అమ్మాయిలే బలవుతున్నారని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా.
ఒకానొక ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చింది.నేను ఇష్టం వచ్చినట్లు, ఏది పడితే ఆదిమాట్లాడతాను అని నన్ను చాలా మంది అంటూ ఉంటారు.కానీ అలా నేను మాట్లాడాను అంటే ఎదో ఒక కారణం ఉండబట్లే అని అంటుంది గాయత్రి.
ఏది ఉన్నాగాని నేను బోల్డ్ గా మాట్లాడతాను.అది వాళ్ళు అర్ధం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
నేను నా మనసుకు నచ్చినట్లు మాట్లాడతాను.నాకు నేను నచ్చినట్లు ఉంటాను.
నేను మాట్లాడింది ఎదుటివాళ్ళకు అర్ధం కాకాపోతే అది తప్పు అనకూడదు.అర్ధం చేసుకోవడానికి ట్రై చేయాలి అలా కుదారకపోతే సైలెంట్ గా ఉండాలి తప్పా ఎదుటివాళ్ళు మాట్లాడింది తప్పు అనకూడదు అని అంటారు గాయత్రి.
చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకుంది.సమాజానికి ఏదోటి పనికొచ్చేది చేయాలనీ అనుకునేది కానీ నాకు ఎప్పుడు చదువు మైండ్ కి ఎక్కేది కాదు.
పుస్తకాలు తీస్తే చాలు పిచ్చెక్కేది.ఎలాగోలా ఇంజినీరింగ్ కంప్లీట్ చేశా అని చెప్పుకొచ్చింది.
అలాగే ఒకానొక బిగ్ బాస్ షో గురించి కూడా చెప్పి అప్పట్లో గాయత్రి వివాదాలు తెచ్చుకుంది.బిగ్ బాస్ విషయంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి.
ఇంతకు ముందు కూడా వీటిని నేను లైట్ తీసుకున్నాను.ఎందుకంటే నేను వాటిని చూడలేదు, వినలేదు కాబట్టి.
ఇపుడు నా వరకు వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడాలనిపించింది.
బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ సరిగా లేదని, వారు చేసే ప్రామిసెస్ కరెక్టుగా లేవు.అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేసిన రెండు నెలల తర్వాత మీరు లేరు అని డిక్లేర్ చేయడం వల్ల నేను ఆల్రెడీ కమిటైన ఆరు ప్రాజెక్టులు పోగొట్టుకున్నానని అప్పట్లో ఈమె చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.దానికి పరిహారం అడిగితే ఫోన్ కూడా ఎత్తడం లేదని గాయిత్రి గుప్తా తెలిపారు.
గాయత్రీ గుప్త ఫిదా సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత ఇంటర్వ్యూ లో కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తలలో నిలిచింది ఇప్పుడు ఒక హాట్ స్టేట్మెంట్ తో అందరికి షాక్ ఇచ్చింది.రామ్ గోపాల్ వర్మ గారు నాకు ‘ఐస్ క్రీమ్ 2’లో అవకాశం ఇచ్చారని, ఆయన గురించి నాకు చాలా మంది చాలా చెప్పారు కానీ నేను స్వయంగా ఆయన ఎలాంటివారో తెలుసుకోవాలని అనుకున్నాను.
ఆయనతో సినిమా చేయడం అంటే మారథాన్ లో పాల్గొన్నట్లే ఉంటది.మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటే చాలు అనిపిస్తుంది అని ఆసక్తికర మాటలు కూడా చెప్పింది.
ఒకానొక సమయంలో గాయత్రి ఎన్నో బాధలు పడిందట.ఎన్నో రోజులు ఆకలితోనే ఉన్నా.కొన్నిసార్లు టైం అలా వస్తుంది.పేరెంట్స్ లేరు.
ఫ్యామిలీ లేదు.నేను మంచి దాన్ని కాదేమో అన్న భ్రమతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా.
మనిషిలో తొమ్మిది ఎమోషన్స్ ఉంటాయి.అవి వస్తుంటాయి పోతుంటాయి. అలా వచ్చిన ఏ ఒక్క ఎమోషన్ నుండి తప్పించుకోలేము.కంప్లీట్‌గా ఎమోషన్‌ను అనుభవించిన తరువాతే బయటకు వస్తాం ఎవరైనానేనూ ఒకతన్ని చాలా ఇష్టపడ్డా.డీప్ గా ప్రేమించా, నేను ఎమోషనల్ పర్శన్ ని.డీప్ గా లవ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి.ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఫిల్ కాకపోతే హర్ట్ అవుతాం.ఫుల్ ఫిల్ చేస్తాం అని ప్రామిస్ చేస్తారు.అయితే ఈ వరల్డ్ లో ప్రామిస్ తో పుట్టలేదు.ప్రతిది క్వచ్ఛన్ మార్క్.
ఆ క్వచ్ఛన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదని అర్ధమైంది.డీప్ లవ్ లో పడిన తరువాత నాకు ఇది అర్ధమైంది.
లవ్ చేసిన తరువాత ఇదంతా అవసరమా? అని అనిపించింది.నేను అతను చాలా డీప్‌గా లవ్ చేసుకున్నాం.
కాని నా కర్మకొద్దీ బ్రేకప్ అయ్యింది.ఆ బ్రేకప్ కు రీజన్ మాత్రం తనే.నేను అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుని ఉన్నా.ప్రేమించినప్పుడు తనకి తెలుసు ఈ విషయం.
అయితే వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు.తన పేరెంట్స్ అంటే భయం అతనికి.
వాళ్లతో కొట్లాడే ధైర్యం లేదంటూ సారీ అన్నాడు.అతను ఆ మాట చెప్పగానే చాలా ఏడ్చా.
సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా.పెద్ద లొల్లి అయ్యింది.
రెండు నెలలు పాటు అతన్ని ఒప్పించడానికి చూశా.చాలా ప్రయత్నం చేశా.
కాని ఏదీ మనకి శాశ్వతం కాదని అప్పుడే అర్ధమైంది.మీరైతే లవ్ చేయండి.
దాని నుండి ఏం ఆశించవద్దు.వస్తే మీ లక్కీ లేదంటూ లైట్ అనుకుని ముందుకు మూవ్ అయిపోండి’ అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్తా.