అమెరికా అధ్యక్ష పదవి అంటే మాటలు కాదు ఎన్నో సవాళ్లు మరెన్నో వ్యూహాలు.దేశాల మీద పెత్తనం.
మాట వినని దేశాలని మనుషులని తనవైపుకి నయానో, భయానో తిప్పుకోవడం.ఇలాంటి ఎన్నో సవాళ్లు ఉంటాయి.
వీటన్నిటిని తట్టుకుని నిలబడగలిగేదే అద్యక్ష పదవి.అయితే ఇప్పుడు ఈ పదవిలో ట్రంప్ కొనసాగుతున్నా త్వరలో ఆయన తన పదవి నుంచీ తప్పుకోవాల్సిందే.ఆ తరువాత అమెరికా అద్యక్ష పదవి కోసం పోటీ పడుతోంది మాత్రం
భారత సంతతికి చెందిన తులసి గబ్బార్.గతంలో ఆమె పేరు పలుమార్లు వినిపించినా ఈ సారి ఆమె స్వయంగా ప్రకటన చేయడం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పోటీ చేయాలని భావిస్తున్న తొలి హిందూ మహిళ ఆమె.2020లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
హవారు నుండీ నాలుగు సార్లు డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎంపిక కాబడ్డారు.ఒక మీడియా ప్రతినిధి ఆమెని జరగబోయే అధ్యక్ష ఎన్నికల గురించి ప్రశ్నించగా ఈ సారి ఎన్నికలని చాలా సీరియస్ గా తీసుకుంటానని బదులు ఇచ్చారు.ఒక వేళ 2020 ఎన్నికల్లో ఆమె పోటీ చేసి గెలుపొందితే అధ్యక్ష పదవి దక్కిన అత్యంత పిన్న వయస్కురాలిగా, తొలి మహిళగానూ తులసి గబ్బార్ రికార్డ్ క్రియేట్ చేస్తారు.
.