తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు సామెతని వినే ఉంటారు కదా ఈ సామెత సరిగ్గా ట్రంప్ ప్రవర్తనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.వలసదారుల్లో పుట్టే పిల్లలకి వచ్చే జన్మతః పౌరసత్వం లేకుండా చేయడానికి ట్రంప్ వ్యుహాలని సిద్డం చేస్తుంటే ఈ విధానంపై సొంత పార్టీ నేతలు సైతం అభ్యంతరం తెలుపుతున్నారు.
అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు…జన్మతః పౌరసత్వపు హక్కు.ఓ వెర్రి విధానమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ విధానం వలన ఎక్కువగా చైనీయులు లాభపడుతున్నారని అంటున్నారు ట్రంప్.ఈ హక్కు కారణంగా బర్త్ టూరిజం అనే ఓ పరిశ్రమ తయారైందని , ప్రపంచం నలుమూలలనుంచి ఏ మహిళ అయినా సరే.కేవలం ప్రసవం కోసం అమెరికా వచ్చి పిల్లల్ని కంటే చాలు.ఆ బిడ్డకు జీవితకాలపు పౌరసత్వం తప్పనిసరిగా దక్కుతుందనే స్థాయికి ఈ హక్కు వెళ్లిందని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు.
.మన శత్రువు భార్య అమెరికా గడ్డమీద బిడ్డను కంటే.మీ పిల్లాడికి పౌరసత్వం ఇస్తున్నామని అభినందనలు చెప్పాలా?అంటూ అమెరికన్ల ని ట్రంప్ ప్రశ్నించారు.అక్రమ వలసదారులకు పుట్టే ప్రతీ బిడ్డకు సహజంగానే పౌరసత్వం దక్కాలని ప్రతిపక్ష డెమోక్రాట్లు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు…అయితే చివరిగా భారతీయ ఎన్నారై లకి గుడ్ న్యూస్ తెలిపారు.
ఏండ్ల తరబడి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులు, ఇతర నిపుణులని త్వరలోనే అమెరికాలోకి ఆహ్వానం పలుకుతామని ట్రంప్ తెలిపారు.