పెట్రోల్ కోసం వేచి చూస్తూనే ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్.. ఎక్కడంటే?

శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారిపోతుంది.అప్పుల ఊబిలో కూరిపోయిన ఆ దేశంలో… పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపే ఓ ఘటన జరిగింది.అదేంటంటే… పెట్రోల్ కోసం ఓ వ్యక్తి గత ఐదు రోజులుగా పెట్రోల్ బంక్ వద్దే ఎదురు చూస్తున్నాడు.చాలా మంది పెట్రోల్, డీజిల్ ల కోసం రావడంతో క్యూలో నిల్చున్నారు.

 Truck Driver Dies Waiting For Petrol Five Days In Srilanka Details, Man Dies Of-TeluguStop.com

రోజుల తరబడి నిల్చున్నా ఎవరికి ఇంధనం దొరుకుతుందో లేదో తెలియదు.అయితే తాజాగా అంగురరవటోటలో ఓ వ్యక్తి పెట్రోల్ కోసం వెళ్లి క్యూలో నిల్చున్నాడు.

అక్కడే తుది శ్వాస విడిచాడు.తన వాహనంలోనే విగతజీవిగా మారి.

కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.అయితే మృతుడి వసు 53 ఏళ్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు.

వారంలో రోజుల కిందట కూడా ఓ 53 ఏళ్ల వ్యక్తి ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.తన మూడు చక్రాల బండిలోనే గుండెపోటుతో కుప్పకూలాడు.దేశంలోని పశ్చిమ రాష్ట్రంలో పెట్రోల్ కోసం క్యూలో నిల్చొని మరణించిన వారి సంఖ్య 10కి చేరింది.కేవలం పెట్రోల్, డీజిల్ యే కాదండోయ్… నిత్యావసర ధరలు, వంట గ్యాస్, పవర్ ఇలా అన్ని రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారు శ్రీలంక ప్రజలు.

ఇంన కొరత కారణంగా ప్రతీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రోజుగా ప్రకటించింది.

Telugu Fuel Sri Lankaa, Petrol Srilanka, Petrol, Sri Lanka, Srilanka, Srilanka L

వచ్చే మూడు నెలల పాటు ఇలాగే ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.అలాగే ఇఫ్పటికీ అక్కడి పాఛశాలలు మూతపడే ఉన్నాయి.అయితే దివాలాకు దగ్గరగా ఉన్న శ్రీలంక ఈ ఏడాది అప్పులు చెల్లించలమేని.వచ్చే ఏడాది తీరుస్తామని ప్రకటించింది.2026లోపు 25 బిలియన్ డాలర్ల రుణాన్ని శ్రీలంక చెల్లించాల్సి ఉంటుంది.ఆ దేశానికి మొత్తం 51 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube