పెట్రోల్ కోసం వేచి చూస్తూనే ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్.. ఎక్కడంటే?
TeluguStop.com
శ్రీలంక పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారిపోతుంది.అప్పుల ఊబిలో కూరిపోయిన ఆ దేశంలో.
పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపే ఓ ఘటన జరిగింది.అదేంటంటే.
పెట్రోల్ కోసం ఓ వ్యక్తి గత ఐదు రోజులుగా పెట్రోల్ బంక్ వద్దే ఎదురు చూస్తున్నాడు.
చాలా మంది పెట్రోల్, డీజిల్ ల కోసం రావడంతో క్యూలో నిల్చున్నారు.రోజుల తరబడి నిల్చున్నా ఎవరికి ఇంధనం దొరుకుతుందో లేదో తెలియదు.
అయితే తాజాగా అంగురరవటోటలో ఓ వ్యక్తి పెట్రోల్ కోసం వెళ్లి క్యూలో నిల్చున్నాడు.
అక్కడే తుది శ్వాస విడిచాడు.తన వాహనంలోనే విగతజీవిగా మారి.
కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.అయితే మృతుడి వసు 53 ఏళ్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు.
వారంలో రోజుల కిందట కూడా ఓ 53 ఏళ్ల వ్యక్తి ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.
తన మూడు చక్రాల బండిలోనే గుండెపోటుతో కుప్పకూలాడు.దేశంలోని పశ్చిమ రాష్ట్రంలో పెట్రోల్ కోసం క్యూలో నిల్చొని మరణించిన వారి సంఖ్య 10కి చేరింది.
కేవలం పెట్రోల్, డీజిల్ యే కాదండోయ్.నిత్యావసర ధరలు, వంట గ్యాస్, పవర్ ఇలా అన్ని రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారు శ్రీలంక ప్రజలు.
ఇంన కొరత కారణంగా ప్రతీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రోజుగా ప్రకటించింది.
"""/"/
వచ్చే మూడు నెలల పాటు ఇలాగే ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
అలాగే ఇఫ్పటికీ అక్కడి పాఛశాలలు మూతపడే ఉన్నాయి.అయితే దివాలాకు దగ్గరగా ఉన్న శ్రీలంక ఈ ఏడాది అప్పులు చెల్లించలమేని.
వచ్చే ఏడాది తీరుస్తామని ప్రకటించింది.2026లోపు 25 బిలియన్ డాలర్ల రుణాన్ని శ్రీలంక చెల్లించాల్సి ఉంటుంది.
ఆ దేశానికి మొత్తం 51 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి.
బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?