Trivikram Nuvve Nuvve Movie : త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్.. ఆ సినిమా రీ రిలీజ్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజులు కనుక వస్తే వారు నటించిన సినిమాలను తిరిగి విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది.అయితే త్వరలోనే మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

 Trivikram', Birthday Special,re Release Movie, Nuvve Nuvve ,trivikram ,tollywood-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.రచయితగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు.

స్రవంతి రవి కిషోర్ గారి నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ శ్రేయ ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కలెక్షన్లను రాబట్టింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దర్శకుడుగా కూడా మంచి పేరు తీసుకువచ్చింది.

ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో మరోసారి స్పెషల్ షో వేశారు.అయితే ఈ షో కి వచ్చిన స్పందన చూసినటువంటి నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారు తిరిగి ఈ సినిమాని విడుదల చేయాలని భావించారు.

Telugu Nuvve Nuvve, Shreya, Sravantiravi, Tarun, Tollywood, Trivikram-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమా 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ నవంబర్ 7వ తేదీ పుట్టిన రోజున జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఈ సినిమాని 2కే హెచ్ డి ప్రింట్ లో తెలుగు రాష్ట్రాలలో కొన్ని థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నట్లు రవి కిషోర్ వెల్లడించారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాలను తెలియచేయునట్లు రవి కిషోర్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube