ఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన యాక్టర్ పృథ్వి గురించిన పెళ్లి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.తన కన్నా వయసులో ముప్పై రెండేళ్లు చిన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తెలుస్తుంది.
ఇందులో వాస్తవం లేకపోలేదు.తన ఆరవ ఏటా నుంచే నటించడం మొదలు పెట్టిన పృథ్వి ఏకంగా గా 5 దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు.
ఇక 56 ఏళ్ళ వయసులో 28 ఏళ్ళ కొడుకు ఉన్న పృథ్వి శీతల్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అని అలాగే ఒక బిడ్డను కూడా కనాలని ఉందంటూ పృథ్వి రాజ్ స్టేట్మెంట్ ఇస్తుండటం కొసమెరుపు.
అతి త్వరలో వీరు పెళ్లి బంధం తో ఒక్కటవుతన్నారు.
ఈ వయసులో మరో పెళ్లి చేసుకోవడం గురించి పృధి అనేక విషయాలను బయటపెట్టాడు.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ తన జీవితాల్లో పడ్డ బాధలను వివరించాడు.ఇక 1994 లో బీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పృథ్వి కి అహెద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు ఉన్నాడు.
ఇతడికి మానసిక ఎదుగుదల లేకపోవడం తో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.చాల ఏళ్లుగా వీరి మధ్య ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఆరేళ్లుగా భార్యను వద్దనుకుని, వేరే ఇల్లు తీసుకొని విడిగానే ఉంటున్నాడు.ఇక ఏడాది క్రితం శీతల్ పరిచయం అవ్వగా వీరి మధ్య ప్రేమ బంధం వికసించింది.
వయసు బేధం ఉన్నప్పటికి, సమాజం ఏమో అనుకుంటుంది అని బయపడల్సిన అవసరం లేదని మీడియా ముఖంగా అతడి ప్రేమను పృథ్వి బయట పెట్టడం విశేషం.ఇక శీతల్ ను పెళ్లి చేసుకోవాలంటే బీనా తో విడాకులు తప్పని సరి కాబట్టి గత నెల పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయారు.ఇక అతి త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకుంటామని, పిల్లలను కూడా కంటామని ఈ జంట చెప్తున్నారు.ఇక శీతల్ కి కేవలం 23 ఏళ్ళు ఉండటం విశేషం.
పృథ్వి కొడుకు కన్నా కూడా ఐదేళ్లు చిన్న అమ్మాయిని ప్రేమించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నప్పటికీ తన ప్రేమలో నిజాయితీ ఉందంటున్నారు పృథ్వి.