శభాష్.. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ గెలుపు..!

ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచిన ఆడవాళ్లను, మగవాళ్ళను మీరు చూసి ఉంటారు.కానీ మొట్ట మొదటిసారిగా తమిళనాడు ఎన్నికల్లో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.

 Transgender Victory In Tamil Nadu State Elections Tamilnadu , Transgender, Late-TeluguStop.com

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన గంగా నాయక్ అనే ఒక ట్రాన్స్ జెండర్ ఎన్నికల్లో విజయం సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది.తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డ్ నెలకొల్పింది గంగా నాయక్.

తమిళనాడులోని వేల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 37వ వార్డు విజేతగా ట్రాన్స్ జెండర్ అయిన గంగా నాయక్ ను డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది.

గత 20 ఏళ్లుగా డీఎంకే అభ్యర్థిగా గంగా నాయక్ సేవలు అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలిచినా ఆమె రాబోయే రోజుల్లో తన కమ్యూనిటీకి అందిస్తున్న సేవలు మరింత విస్తరిస్తానని చెబుతుంది.కేవలం 15 ఓట్ల వ్యత్యాసంతోనే ఆమె ఎన్నికల్లో గెలుపొందడం విశేషం అనే చెప్పాలి.

గంగా నాయక్ విషయానికి వస్తే.రోజువారీ కూలి కుటుంబం నుంచి వచ్చిన గంగా నాయక్ ప్రస్తుతం దక్షిణ ఇండియా ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కు సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు అందిస్తున్నారు.

ఆమె సామాజిక కార్యకర్తగానే కాకుండా ఒక 50 మందితో కలిసి థియేట్రికల్ ట్రూప్ ను కూడా మెయింటైన్ చేస్తున్నారు.అయితే ఆ యాభై మందిలో కూడా 30 మంది ట్రాన్స్ జెండర్లే ఉండడం గమనించాలిసిన విషయం అనే చెప్పాలి.ఈ ఎన్నికల్లో ఇంకో గమనించాలిసిన విషయం ఏంటంటే తల్లి, ఇద్దరు కొడుకుల్ని విజేతలుగా ప్రకటించదండంతో పాటు భర్త, భార్యలను కూడా విజేతలుగా ప్రకటించారు.అలాగే ఈ ఎన్నికల్లోనే ఏఐఏడీఎంకేకు చెందిన అభ్యర్థితో పాటు మరో ఇద్దరికీ అసలు ఓట్లే పడకపోవడం గమనార్హం.

మొదటిసారి ఎన్నికల్లో ట్రాన్స్ జండర్ గెలుపుపై పలువురు గంగా నాయక్ ను ప్రశంసిస్తున్నారు.

Transgender Victory In Tamil Nadu State Elections Tamilnadu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube