తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కొంత మంది యంగ్ నటుల్లో నవీన్ చంద్ర,( Naveen Chandra ) చైతన్య కృష్ణ( Chaitanya Krishna ) లాంటి నటులు చాలా ముందు వరుసలో ఉంటారు.కానీ వీళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కూడా వీళ్లకి సరైన బ్రేక్ అనేది రావడం లేదు.
దాంతో చాలా సినిమాల్లో సెకండ్ లీడ్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో అలా కాలాన్ని గడిపేస్తున్నారు.ఇప్పటికే నవీన్ చంద్ర అరవింద సమేత( Aravinda Sametha ) లాంటి ఒక పెద్ద సినిమాలో విలన్ గా నటించినప్పటికీ ఆ సినిమా తర్వాత ఆయనకి పెద్దగా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఏమీ రావడం లేదు.
వచ్చినా కూడా ఏదైనా చిన్న చితక పాత్రలే వస్తున్నాయి తప్ప మెయిల్ లీడ్ ఒకటి కూడా రావడం లేదు.
అందుకే వీళ్లు కూడా ఇప్పుడు రూటు మార్చి హీరోలుగా నటిస్తున్నారు.నవీన్ చంద్ర మొదట అందాల రాక్షసి సినిమాతో( Andala Rakshasi ) ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ సినిమా యావరేజ్ గా అడడంతో ఇండస్ట్రీలో ఈయన పెద్ద స్టార్ గా ఎదగలేకపోయారు.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు దాంతో ఆయన మార్కెట్ అనేది పూర్తిగా పడిపోయింది ఇక అప్పటినుంచి సినిమాల్లో సెకండ్ లీడ్ పాత్రలు గాని,విలన్ పాత్రలు గాని పోషిస్తున్నారు ఇక చైతన్య కృష్ణ పరిస్థితి కూడా అంతే ఈయన
సన్నాఫ్ సత్యమూర్తి, కాటమరాయుడు లాంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ అవి ఏవి ఈయనకి కెరియర్ పరంగా పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి.రీసెంట్ గా వచ్చిన సేవ్ ద టైగర్స్( Save The Tigers ) వెబ్ సిరీస్ లో ఒక మంచి పాత్రను పోషించి తనలో ఉన్నటువంటి నటుడుని ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.ఇక ఇప్పుడు ఆయన కూడా సోలో హీరోగా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.దానికోసమే కొత్త డైరెక్టర్లతో చాలా సంప్రదింపులు కూడా చేస్తున్నాడు ఏదైనా ఒక ప్రాజెక్టు ఓకే అయితే తొందర్లో సెట్స్ మీదికి తీసుకెళ్లి ఒక మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీలో హీరోగా నిలబడాలని చూస్తున్నాడు…
.