కథ బలం మొన్న సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి ఇక ఇంటెన్స్ తో కూడిన ఆ మంచి పీరియాడిక్ డ్రామా చిత్రాలు అయితే ఖచ్చితమైన విజయాలు అందుకుంటాయి అని మనం గతంలో ఎన్నో సార్లు చూసాం.అదే ఫార్ములా కోసం ప్రస్తుతం కొంతమంది హీరోలు ఎదురు చూస్తున్నారు.
గతంలో విజయాలు అందుకోలేక అలాగే కథలపై పట్టు ఉన్న వారు కూడా పీరియాడిక్ డ్రామా పైన ఫోకస్ చేస్తూ ఉండడం విశేషం.ప్రస్తుతం ఫిరియాడిక్ నేపథ్యంలో కొందరి యంగ్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి.మరి ఆ సినిమాలు ఏంటి? వాటిలో నటిస్తున్న హీరోలు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిఖిల్
నిఖిల్ కార్తికేయ( Karthikeya ) సినిమాతో కలలో కూడా ఎవరు ఊహించలేని విజయాన్ని అందుకున్నాడు అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కించగా అది పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలమైన విజయాన్ని నమోదు చేసింది దాంతో నిఖిల్ కి పాన్ ఇండియా కథలపై పట్టు దొరికింది.అందుకే స్వయంభు అనే పేరుతో ఒక కొత్త సినిమా అనౌన్స్ చేశాడు పేరులోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో పాటు పీరియాడికల్ టచ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అఖిల్
ఏజెంట్( Agent ) లాంటి భయంకరమైన పరాజయం తర్వాత ఒక సాలిడ్ హిట్టు కొట్టాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు అక్కినేని చిన్నోడు అఖిల్.అందుకే ఇప్పుడు అలాంటి ఫీల్ ఉన్న సినిమా కోసం చూస్తున్నాడు ఈ నేపథ్యంలో ఒక పీరియాడికల్ స్టోరీ కన్ఫర్మ్ అయింది క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.దీనికి ఒక కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
వరుణ్ తేజ్
ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అని ఒక డిఫరెంట్ సబ్జెక్టుతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్ యాక్షన్ పరంగా బాగానే ఉన్నా సినిమా కలెక్షన్స్ పరంగా పరాజయం పొందింది అయితే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలనుకున్నాడో ఏమో పీరియాడికల్ టచ్ ఉన్న మట్కా లాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చినపుట్స్ చూస్తే ఎవరికైనా పీరియాడికల్ సబ్జెక్ట్ అని అనిపించక మానదు.