సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రాణిస్తున్నారు అంటే వారి తరఫున మరి కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంటుంది.తమ ఫ్యామిలీలో నుంచి ఒక హీరో వస్తే చాలు ఆ హీరో ఫ్యామిలీకి అంతా కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది.
కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే లిస్ట్ అలా కాదు.అన్నదమ్ములు ఇద్దరు మనకు సపరేట్ గా తెలిసిన వారిద్దరు బ్రదర్స్ అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అలా ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా కొనసాగుతూ మీడియా ముందు ఎప్పుడూ కూడా అటెన్షన్ ఇవ్వని ఆ స్టార్స్ ఎవరూ ఇప్పుడు చూద్దాం.
ఓంకార్ బ్రదర్స్
యాంకర్ మరియు డైరెక్టర్ అయినా ఓంకార్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్న విషయం బయట ప్రపంచానికి చాలా తక్కువ మందికే తెలుసు.మొదటి తమ్ముడిని రాజు గారి గది సినిమాతో హీరోగా పరిచయం చేసిన రెండవ తమ్ముడు అదే సినిమాకి ప్రొడ్యూసర్ అన్న విషయం అసలు తెలియదు.ముగ్గురు సోదరులు కలిసి ఇప్పటికే మూడు సినిమాలకి కలిసి పని చేశారు.
శ్రీకాంత్ సోదరుడు అనిల్
అనిల్ మేక కేవలం ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో హీరోగా మారిపోయిన ఆ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలకి నిర్మాణం చేపట్టాడు కానీ శ్రీకాంత్ సోదరుడు అనిల్ గా బయట ప్రపంచానికి చాలా తక్కువనే తెలుసని చెప్పుకోవాలి.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్
పూరి జగన్నాథ్ తన తమ్ముడిని ఎప్పుడూ కూడా ఇండస్ట్రీలో బయట ప్రపంచానికి పరిచయం చేసింది లేదు.సాయిరాం శంకర్ తన సొంత కాళ్ల పైననే హీరోగా ఎదిగాడు.కానీ వీళ్లిద్దరూ అన్నదమ్ములనే విషయం చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు.
జయం రవి సోదరుడు
స్టార్ హీరో జయం రవికి ఒక సోదరుడు ఉన్నాడు.అతను మరెవరో కాదు మన తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ కి దర్శకుడైన మోహన్ రాజా ప్రస్తుతం తమిళనాడు ఫుల్ బిజీ డైరెక్టర్ గా ఉన్న మోహన్ రాజా జయం రవి తమ్ముడే అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
విశాల్ విక్రమ్ కృష్ణ
విశాల్ కి తెలుగు, తమిళనాట చాలా పాపులారిటీ ఉంది కానీ విశాల్ తమ్ముడు విక్రమ్ కృష్ణ ఒక నటుడు అలాగే ఒక ప్రొడ్యూసర్ అనే విషయం బయట ప్రపంచానికి అస్సలు తెలియదు.
AM రత్నం కుమారులు
హీరో రవి కృష్ణ మీకు గుర్తున్నాడా 7 జి బృందావన్ కాలనీ సినిమాతో తెలుగునాట ప్రభంజనం సృష్టించిన రవి కృష్ణ కి ఒక తమ్ముడు ఉన్నాడు.అతని పేరు జ్యోతి కృష్ణ.రవి కృష్ణ ప్రస్తుతం నటించడం మానేసి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు రవికృష్ణ జ్యోతి కృష్ణ ఇద్దరు కలిసి తమిళంలో కేడి ఊ ల్లా ల్లా అనే రెండు సినిమాలకు దర్శకత్వం చేశారు.
ప్రీతి, శ్రీదేవి, వనిత విజయ్ కుమార్
ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ శ్రీదేవి గుర్తుందా ఆమెకు ఇద్దరు అక్కలు ఉన్నారు వారిద్దరు కూడా మన తెలుగు హీరోయిన్స్ రుక్మిణి కళ్యాణం సినిమా హీరోయిన్ అలాగే ప్రేమ నటించిన దేవి సినిమాలో మరొక హీరోయిన్ గా వనిత నటించింది వీరిద్దరూ కూడా శ్రీదేవి అక్కలు కావడం విశేషం.