కుర్ర హీరోయిన్స్ కోసం ఏజ్ బార్ హీరోల ఆరాటం.. వయసు దాచుకోవడానికి పోరాటం

బయట అయినా.సినిమాలో అయినా.

 Tollywood Seniors Facing Problems With Age Raviteja Balakrishna Chiranjeevi Pawa-TeluguStop.com

ఈడూ జోడూ కుదిరితేనే బాగుంటుంది.లేదంటే షష్టిపూర్తి కంప్లీట్ చేసుకున్న హీరో సరసన టీనేజ్ హీరోయిన్ నటిస్తే చండాలంగా ఉంటుంది.

తాజాగా ఏజ్ బార్ హీరోలు, కుర్ర హీరోయిన్లతో సినిమాలు చేస్తుంటే చూసే జనాలకు సైతం ఇదేం జోడీరా బాబోయ్ అని విసుక్కుంటున్నారు.తాజాగా రవితేజ నటించిన ఖిలాడీ సినిమా చూసి తల బాదుకున్నారట.54 ఏండ్ల రవితేజ.తన కంటే కనీసం 30 ఏండ్ల చిన్న వాళ్లు అయిన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేయడాన్ని చూసి విసుక్కున్నారట.

అంతేకాదు.రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటిలోనూ తనకంటే వయసులో 20 నుంచి 30 ఏండ్లు ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్లు కావడం విశేషం.

ఆయన తాజా సినిమా ధమాకాలో హీరోయిన్ గా కేవలం 21 ఏండ్ల శ్రీలీలను ఎంపిక చేశారు.అటు రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో 23 ఏండ్ల దివ్యాన్ష కౌషిక్ ను తీసుకున్నారు.

అటు 66 ఏండ్ల చిరంజీవి కూడా యంగ్ హీరోయిన్లతో జోడీ కడుతున్నాడు.తనకంటే వయసులో చిన్న వారితో స్టెప్పులు వేస్తున్నాడు.ఆచార్యలో కాజల్ తో నటించిన ఆయన.భోళాశంకర్ లో తమన్నాతో యాక్ట్ చేస్తున్నాడు.61 ఏండ్ల అక్కినేని నాగార్జున సైతం తన సినిమాల్లో కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు.తన తాజా సినిమా ఘోస్ట్ లో కూడా యంగ్ హీరోయిన్ తో నటిస్తున్నాడు.

61 ఏళ్ల వెంకటేష్ కూడా ఎఫ్ 3లో 32 ఏళ్ల తమన్నాతో స్క్రీన్ పంచుకుంటున్నాడు.61 ఏండ్ల బాలయ్య కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.గోపీచంద్ మలినేనితో చేస్తున్న మూవీలో తనకంటే 25 ఏండ్లు చిన్నదైన శృతిహాసన్ తో నటిస్తున్నాడు.అఖండలో 31 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ తో రొమాన్స్ చేశాడు.

అటు పవన్ కల్యాణ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు.తన తాజా మూవీ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో తన కంటే వయసులో 20 ఏండ్లు చిన్న అయిన పూజా హెగ్డేతో నటిస్తున్నాడు.అటు హరిహర వీరమల్లు సినిమాలో 28 ఏండ్ల నిధి అగర్వాల్ తో జోడీ కడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube