ఇలాంటి సెంటిమెంట్లు ప్రచారం చేస్తే సినిమా ఫంక్షన్ లే ఉండవేమో

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల లాల్ సింగ్ చడ్డా మరియు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇక నుండి మెగాస్టార్ చిరంజీవి బ్యాడ్ సెంటిమెంట్ కనుక ఆయన్ను ఎవరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకు పిలవకపోవచ్చు అంటూ ప్రచారం మొదలైంది.

 Tollywood Megastar Chiranjeevi Getting Trolls Due To Attend Pre Release Events D-TeluguStop.com

ఇండియన్ సినీ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.అలాంటి మెగాస్టార్ చిరంజీవి హాజరైన రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ఆయనను ఇంతలా ట్రోల్స్ చేయడం ఏమాత్రం సరికాదు అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఆ రెండు సినిమాలకు తన వంతు సాయంగా నిలిచి బూస్ట్ ఇచ్చేందుకు వెళ్లారు.

అంతే తప్పితే ఆ రెండు సినిమాలను ఆయన చేసింది లేదు.

చూసింది లేదు.కనీసం వాటికి పని చేసింది కూడా లేదు.

అయినా కూడా చిరంజీవి వల్లే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ కొందరు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ మెగా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే కాకుండా ఇలాంటి సెంటిమెంట్ ట్రోల్స్ ఇతర స్టార్స్ కి కూడా తప్పడం లేదు.

ఒకటి రెండు సక్సెస్ అయితే వాళ్లను గొప్పవాళ్లుగా అదే ఫ్లాప్ అయితే విమర్శించడం మొదలైంది.

Telugu Chiranjeevi, Chiranjeevi Bad, Day Show, Telugu, Pre, Tollywood-Movie

ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఏ కార్యక్రమానికి హాజరైనా అది ఫ్లాప్ అవుతుండడంతో మెగా స్టార్ చిరంజీవిదే అంతా లోపం అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇలా విమర్శించడం ఏమాత్రం సరైనది కాదు.ఇలాంటి సెంటిమెంట్లు.

తప్పుడు ప్రచారాలు చేస్తే ముందు ముందు స్టార్ హీరోలు మరియు సెలబ్రిటీలు ఇతర హీరోల యొక్క సినిమా ఫంక్షన్లకి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించరు.కనుక తప్పుడు ప్రచారాలను మానేస్తే ఉత్తమం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube