ఇప్పటికే కొంతమంది తమిళ హీరోలు సరిహద్దులు దాటి తెలుగు సినిమాల్లో నేరుగా నటిస్తూ విజయాలను అందుకుంటున్నారు.తమిళంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తమ మార్కెట్ పెరుగుతుంది అని నమ్మకంతో ఇలాంటి సాహసం చేస్తున్నారు.
మరి వారి కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చే సినిమాలు తీస్తే దానికి తగ్గ లాభం ఉంటేనే కదా వారికి కూడా చెల్లుబాటు అయ్యేది.ఆ విషయంలో మన దర్శక నిర్మాతలు ఎలాంటి మొహమాటానికి పోకుండా వారికి సరైన అన్ని రకాల మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు.
అందుకే కొంతమంది తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమాలు చేస్తున్నారు.కానీ ఇలాంటి సాహసం చేయడానికి మన తెలుగు హీరోలకు గట్స్ లేవు అంటే ఒప్పుకోవాల్సిందే ఇంతకీ తెలుగులో నేరుగా సినిమాల తీస్తున్న ఆ తమిళ స్టార్ హీరోస్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ధనుష్( Dhanush ) చాలా రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ తో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు అందుకే సర్ అనే సినిమా తెలుగులో అంత పెద్ద విజయాన్ని అందుకుంది ఆయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది దాన్ని క్యాష్ చేసుకుంటేనే ఆయన తన తదుపరి సినిమాలను కూడా ప్రకటిస్తూ ఉన్నారు.ప్రస్తుతం శేఖర్ కమ్ముల( Sekhar Kammula )తో ఒక సినిమాని చేయబోతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి.ఇక వారసుడు సినిమా( Varasudu )తో విజయ్ కూడా మన దిల్ రాజు నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో మన తెలుగువారి ఆతిథ్యం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు ఇకపై ఎక్కువగా సినిమాలు తీయను కేవలం ఒకటి రెండు మాత్రమే తన తదుపరి కార్యక్రమం అంతా కూడా రాజకీయంగానే ఉంటుందంటూ ప్రకటించేశాడు విజయ్.
ఇక తెలుగులో తానేమీ తక్కువ తినలేదు అంటూ అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాడు హీరో అజిత్.మైత్రి మూవీస్ నిర్మాణంలో గుడ్ బాడ్ అగ్లీ అనే ఒక కథని ఒప్పుకున్నాడట.
దీనికోసం భారీగానే రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారట అజిత్.అందుకోసం అన్ని రకాలుగా ఒప్పుకున్నా మైత్రి మూవీస్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉంది.ఇలా ఈ హీరోలంతా కూడా తమ సరిహద్దులు దాటి వచ్చి తెలుగు నిర్మాతలతో దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.ఇలా వీరు అడుగు వేసిన ప్రతిసారి కూడా విజయాన్ని అందుకున్నారు.
దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని క్రాస్ కాంబినేషన్స్ వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.