టాలీవుడ్ లో హీరో లు( Tollywood Heros ) ఇప్పటి వరకు జాతీయ అవార్డు ను అందుకోలేక పోయారు.అయితే పుష్ప సినిమా తో అల్లు అర్జున్( Allu Arjun ) ఆ అవార్డు ను సొంతం చేసుకోవడం తో చాలా మంది యంగ్ స్టార్ హీరోలు మరియు సీనియర్ హీరోలు కూడా అవాక్కవుతున్నారు.
టాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తే జాతీయ అవార్డును సొంతం చేసుకోవచ్చు అంటూ దీంతో నిరూపితం అయింది.అందుకే ముందు ముందు చాలా మంది హీరోలు జాతీయ అవార్డు కోసం పోటీ పడాలని భావిస్తున్నారు.
మొన్నటి వరకు జాతీయ అవార్డుకు నామినేషన్స్ పంపించడం అవసరమా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ఇప్పుడు మాత్రం ఏమాత్రం సక్సెస్ అయినా కూడా ఆ సినిమా కు జాతీయ అవార్డుల కోసం దరకాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.గతంలో ఉన్నట్లు పద్దతులు ఇప్పుడు లేదు.కనుక కాస్త గట్టిగా ప్రయత్నించి ఒక్క జాతీయ అవార్డు( National Award ) అయినా దక్కించుకోవాలని చాలా మంది టాలీవుడ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు.
వారి ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో కానీ అల్లు అర్జున్ మళ్లీ పుష్ప 2( Pushpa 2 ) సినిమా కు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంటాడు అంటూ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఇక జాతీయ అవార్డులకు సంబంధించిన హడావిడి మొదలు అయిన సమయంలో రాజకీయాలతో కూడా ప్రయత్నాలు చేయాలని ఇప్పటి నుండే కొందరు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు.అల్లు అర్జున్ కు అవార్డు వచ్చి మాకు రాలేదు అంటూ కాస్త అవమానంగా ఉందని కొందరు మాట్లాడుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం తమలో తాము కుంగి పోతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.రాజమౌళి( Rajamouli ) వల్ల ఆస్కార్ పై( Oscar ) కూడా సినీ వర్గాల వారిలో ఆసక్తి నెలకొంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలకు సంబంధించి ఇక నుండి అవార్డుల కోసం వేట మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.