టైగర్ నాగేశ్వరరావు ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. రవితేజ ఫ్యాన్స్ కు నిరాశే అంటూ?

రవితేజ( Ravi Teja ) హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీ నేడు రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది.తాజాగా విడుదలైన భగవంత్ కేసరి, లియో సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాల స్థాయిలో టాక్ అయితే రాలేదనే చెప్పాలి.

 Tiger Nageshwar Rao Movie Plus And Minus Points Details Here Goes Viral In Soci-TeluguStop.com

గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, రవితేజ నటన, ఇంటర్వెల్, క్లైమాక్స్ బీజీఎం బాగున్నాయి.అయితే దాదాపుగా మూడు గంటల నిడివితో తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్ అయింది.సినిమాలో టైగర్ నాగేశ్వరరావును పరిచయం చేసిన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది.

ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సైతం దారుణంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.దసరాకు గట్టి పోటీ ఉండటం కూడా టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టైగర్ నాగేశ్వరరావు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.రవితేజ సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు.మరీ సీరియస్ సినిమాలు రవితేజకు సూట్ కావనే సంగతి తెలిసిందే.రవితేజ తర్వాత మూవీ ఈగిల్( Eagle ) సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

రవితేజ సినిమాలు కొన్ని నెలల కాలంలోనే వరుసగా థియేటర్లలో రిలీజ్ అవుతుండటం కూడా ఆయనకు మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రవితేజ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube