తెల్ల జుట్టు రావడం ప్రారంభమైందా.. టెన్షన్ వద్దు ఈ పవర్ ఫుల్ రెమెడీతో చెక్ పెట్టండి!

వైట్ హెయిర్( White hair ).చాలా మందిని కలవర పెట్టే జుట్టు సమస్యల్లో ఇది ఒకటి.

 This Powerful Remedy Helps To Stop White Hair! White Hair, Stop White Hair, Hair-TeluguStop.com

ఒకప్పుడు ఏజ్ బార్ అవుతున్న వారిలోనే ఈ సమస్య కనిపించేది.కానీ ఇటీవల పాతిక, ముప్పై ఏళ్ల వారికి సైతం తెల్ల జుట్టు వచ్చేస్తోంది.

పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, రసాయనాలు అధికంగా ఉండే షాంపూ వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది.ఏదేమైనా తెల్ల జుట్టు ముసలితనానికి సంకేతం.

అందుకే తలలో తెల్ల జుట్టు కనిపించిందంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ టెన్షన్ వద్దు ప్రారంభంలోనే ఈ సమస్యను గమనించి సరైన చిట్కాలు పాటిస్తే సమర్థవంతంగా తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బ‌లు కరివేపాకు( Curry leaves ), ఒక కప్పు కలబంద( Aloe vera ) ముక్కలు, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి./br>

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మందారం పొడి, వన్ టేబుల్ స్పూన్ గోరింటాకు పొడి వేసుకోవాలి.అలాగే కలబంద కరివేపాకు జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని గంట పాటు మూత పెట్టి వదిలేయాలి.

ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు రావడం కంట్రోల్ అవుతుంది.తెల్ల జుట్టు ఉన్నా సరే క్రమంగా నల్లబడుతుంది.

ఈ రెమెడీ మీ జుట్టును నల్లగా మెరిపిస్తుంది.అదే సమయంలో చుండ్రు సమస్య( Dandruff )ను నివారిస్తుంది.

జుట్టు ఒత్తుగా పెరిగేలా సైతం ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube