యూట్యూబ్‌లో అత్యంత సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఇదే!

ఎలాంటి వీడియో కంటెంట్ అయినా దొరికే ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఈ ప్లాట్‌ఫామ్‌లో కోట్ల కొద్ది సబ్‌స్క్రైబర్లతో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతున్న వారేందరో ఉన్నారు.

 This Is The Most Subscribed Channel On Youtube! Youtube, Youtube Subscribers, T-TeluguStop.com

కాగా యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనే ఒక ఇంటరెస్ట్ చాలామందికి ఉంటుంది.అలాంటి వారి కోసం స్టాటిస్టా తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్నవారు ఎవరో చెప్పేసింది.

Telugu Pewdiepie, Sony, Youtube-Latest News - Telugu

స్టాటిస్టా రేటింగ్ ప్రకారం, ఇండియన్ మ్యూజిక్ బ్రాండ్, నిర్మాణ సంస్థ T-Series యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడు 234 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లతో నంబర్ 1 ప్లేస్‌లో ఉంది.కోకోమెలన్, యానిమేటెడ్ నర్సరీ పాటలను పోస్ట్ చేసే ఛానెల్, 152 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో రెండవ ప్లేస్‌లో ఉంది.సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (SET) ఇండియా 150 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో మూడో ప్లేస్‌లో ఉంది.

Telugu Pewdiepie, Sony, Youtube-Latest News - Telugu

ఎక్స్‌ట్రీమ్ స్టంట్స్ బిగ్ గిఫ్ట్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ 129 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో నాల్గవ స్థానంలో నిలిచాడు.స్వీడిష్ యూట్యూబర్ అయిన ప్యూడీపీ (PewDiePie) 111 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో ఐదవ స్థానంలో నిలిచాడు.స్టాటిస్టా వారి అనాలిసిస్ నుంచి యూట్యూబ్ సొంత ఛానెల్‌లను మినహాయించింది.

యూట్యూబ్ షార్ట్స్‌ అని పిలిచే వారి షార్ట్-ఫామ్ వీడియో కంటెంట్‌కు జనాదరణ పెరిగింది, వారి సంవత్సరాంతపు లిస్ట్‌లో టాప్ 20 ఇండియన్ క్రియేటర్స్‌లో దాదాపు సగం మంది షార్ట్-ఫామ్ వీడియోలలో స్పెషలిటీ కలిగి ఉన్నారు.కాగా హైయెస్ట్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్న ఛానల్ ఇండియాదే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube