పేరులో నాగ అన్న పదం లేకపోవడమే అఖిల్ కు శాపమా.. అందుకే వరుస ఫ్లాపులా?

అక్కినేని హీరోలలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య( Nageshwarrao, Nagarjuna,Nagachaitanya ) కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.ఈ ముగ్గురి పేర్లలో నాగ( Naga ) అనే పదం కామన్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే.

 This Is The Curse For Hero Akhil Details Here Goes Viral In Social Media Detai-TeluguStop.com

అయితే అఖిల్( Akhil ) పేరులో మాత్రం నాగ అనే పదం లేదు.పేరులో నాగ అన్న పదం లేకపోవడమే అఖిల్ కు శాపమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.

నాగ అనే పదం అఖిల్ పేరులో ఉండి ఉంటే మాత్రం అఖిల్ కెరీర్ మరో రేంజ్ లో ఉండేదని అఖిల్ కెరీర్ పరంగా తప్పు చేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగేశ్వరరావు పూర్వీకుల కలలో నాగుపాము రావడంతో పాటు నాగపాము పిల్లలు కూడా కనిపించడం వల్ల పేర్లలో ఈ సెంటిమెంట్ కొనసాగిందని సమాచారం.అఖిల్ కు కూడా నాగ అఖిల్ అని పేరు పెట్టాలని నాగార్జున భావించినా నాగ్ కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి ఒకరు అందుకు అంగీకరించలేదని సమాచారం.

అఖిల్ తర్వాత సినిమా కొత్త దర్శకుని డైరెక్షన్ లో యూవీ క్రియేషన్ బ్యానర్ లో ధీర టైటిల్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమాతో కూడా అఖిల్ ఖాతాలో సక్సెస్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అఖిల్ పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.అఖిల్ తన సినిమాల బడ్జెట్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.సినిమా బడ్జెట్లు పెరిగినంత మాత్రాన కలెక్షన్లు పెరగవని గుర్తుంచుకోవాలి.అఖిల్ మొదట పరిమిత బడ్జెట్ సినిమాలలో నటించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాల్సి ఉంది.

అఖిల్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేయకుండా మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube