బెలారస్‌లో(Belarus) ఓ షాపు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కారణం ఏంటంటే అక్కడ బుడగల చుట్టు (బబుల్ ర్యాప్(Bubble wrap))తో చేసిన డ్రెస్సులు అమ్ముతున్నారు.
ZNWR అనే బ్రాండ్ లేదా “బెలారస్ బాలెన్సియాగా” అని కూడా పిలుచుకునే ఈ కంపెనీ వాళ్లు హాలిడే ఫ్యాషన్‌కి సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు.బబుల్ ర్యాప్‌తో అదిరిపోయే డ్రెస్సులు, జాకెట్లు డిజైన్(Dresses, jackets design) చేశారు.వీటి ధర సుమారు రూ.7,200 (S$116) ఉండటం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
ఈ డ్రెస్సులన్నీ పెద్ద బబుల్ ర్యాప్ ప్యానెల్స్‌తో చేశారు.చూడటానికి చాలా కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఉన్నాయి.అంతేకాదు, వీటిని వేసుకున్నవాళ్లు నడుస్తుంటే బబుల్స్ పేలుతూ ఒక రకమైన ఫన్ క్రియేట్(Create Fun) అవుతుంది.మిన్స్క్‌లోని ఓ మాల్‌లో ఈ డ్రెస్సుని చూసిన ఓ టిక్‌టాక్ యూజర్(TikTok user) దీన్ని వీడియో తీసి పోస్ట్ చేసింది.“డ్రెస్సులు కావాలనుకునే అమ్మాయిలు, ఇదిగో ఇక్కడ చూడండి” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అంతే, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.
వేలల్లో వ్యూస్, కామెంట్లతో హోరెత్తిపోతోంది.
టిక్‌టాక్‌లో ఓ యూజర్ చేసిన వీడియోతో ఈ బబుల్ ర్యాప్ డ్రెస్సులు నిజంగా ఫ్యాషన్ ఐటమ్సేనని తేలిపోయింది.ఊరికే కామెడీ కోసం చేసింది కాదని, ఒరిజినల్ డిజైన్ అని చెప్పింది.జిప్, ప్రైస్ ట్యాగ్ కూడా చూపించింది.
ఒక్కో డ్రెస్ ధర 280 బెలారసియన్ రూబుల్స్ (మన కరెన్సీలో దాదాపు ₹7,200).ZNWR వాళ్లు ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం 20 డ్రెస్సులు, 20 జాకెట్లు మాత్రమే రిలీజ్ చేశారు.
ఇక జాకెట్ కావాలంటే 380 రూబుల్స్ (దాదాపు ₹9,900) పెట్టాలి.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ బబుల్ ర్యాప్ అవుట్‌ఫిట్స్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు ఫుల్లుగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఒక యూజర్ అయితే “ఇది వేసుకుంటే టెన్షన్లన్నీ పటాపంచలైపోతాయి” అని కామెంట్ చేశాడు.
ఇంకొకరేమో “మీ ఎక్స్‌కి దీన్ని గిఫ్ట్‌గా పంపించండి, కాస్త కూల్ అవుతారు” అని రాసుకొచ్చాడు.ఈ డిజైన్‌ను చూసి చాలామంది క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు.“సూపర్బ్”, “కిర్రాక్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇది చూస్తుంటే ఒకప్పుడు లేడీ గాగా మీట్‌తో చేసిన డ్రెస్, లైవ్ ఫిష్‌తో డ్రెస్ వేసుకున్న మోడల్ వీడియో గుర్తుకు వస్తున్నాయి.
అప్పట్లో అవి కూడా ఇలానే ట్రెండ్ అయ్యాయి.