బాన పొట్ట కారణంగా బెంగ పెట్టుకున్నారా.? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతున్నారా.? ఇతరులు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయా.? అయితే అసలు వర్రీ అవకండి.నిజానికి పొట్ట బానలా పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.అలాగే ఆ పొట్టను కరిగించుకోవడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను రోజు నైట్ నిద్రించే ముందు తీసుకుంటే నెల రోజుల్లో మీ బాన పొట్ట మాయం అవుతుంది.మరి ఇంతకీ ఆ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్లు వాము, పది లవంగాలు, రెండు అంగుళాల దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో వేయించుకున్న పదార్థాలు అన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.అలాగే తయారుచేసి పెట్టుకున్న పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఒక గ్లాసు పాలు పోసి మరో నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.ఫైనల్ గా పాలను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనె కలిపి సేవించాలి.
రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఈ మిల్క్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అలాగే వెయిట్ లాస్ కు కూడా ఈ పవర్ ఫుల్ డ్రింక్ తోడ్పడుతుంది.చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు.ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదని సతమతం అవుతుంటారు.అలాంటి వారు కూడా ఈ మిల్క్ ను తీసుకోవచ్చు.
రోజు నైట్ ఈ మిల్క్ ను తాగితే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.