ప్రస్తుతం సినిమా రంగంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడాల్లేకుండా అన్ని సినిమాలకు సంబంధించి ఓటీటీ రైట్స్( OTT rights ) విషయంలో ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.సినిమా పెద్ద హిట్ అయితే ఓటీటీ రైట్స్ కు డిమాండ్ పెరుగుతుందని చెప్పవచ్చు.
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ 150 కోట్ల రూపాయలకు( Netflix for Rs 150 crore ) కొనుగోలు చేయడం గమనార్హం.
గేమ్ ఛేంజర్ ( game changer )డిజిటల్ హక్కులు ప్రైమ్ సొంతం కాగా 160 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం.
ఓజీ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం కాగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆదిపురుష్ సినిమా ( Aadipurush movie )డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ డిజిటల్ హక్కులు 250 కోట్ల రూపాయలకు ప్రైమ్ సొంతమయ్యాయి.
పుష్ప2 సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా 275 కోట్ల రూపాయలకు( 275 crore ) కొనుగోలు చేసింది.ఆర్.ఆర్.ఆర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేయడం గమనార్హం.కేజీఎఫ్2 డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 320 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కల్కి 2898 ఏడీ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )357 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో అదే సమయంలో సబ్ స్క్రిప్షన్ల ఛార్జీలు సైతం పెరుగుతున్నాయి.ఎక్కువమంది ప్రేక్షకులు ప్రస్తుతం సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఓటీటీలలో సినిమాలు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ అంతకంతకూ పెరగాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.