ఆరోగ్యమైన జీవితాన్ని గడపటంలో మంచి ఆహారం కీలక పాత్రను పోషిస్తుంది.అయితే కొన్ని ఆహారాలను పచ్చిగా తింటే ఆరోగ్యకరం.
ఇంకొన్ని ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి.ఎందుకంటే, ఉడికించడం వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు సులభంగా జీర్ణం అవుతాయి.
కొన్ని హానికరమైన పదార్థాలు తొలగిపోతాయి.మరి ఇంతకీ అటువంటి ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్( Carrot ).చాలా మందిని దీనిని పచ్చిగానే తింటుంటారు.కానీ పచ్చిగా కన్నా క్యారెట్ ను ఉడికించి తీసుకుంటేనే ఎక్కువ మేలు.ఎందుకంటే, ఉడకబెట్టిన క్యారెట్ లో బీటా-కెరోటిన్ శోషణ పెరుగుతుంది.అలాగే బీట్‌రూట్ ( Beetroot )ను ఉడికించి తీసుకోవాలి.ఉడికించడం ద్వారా దానిలోని నైట్రేట్లు శరీరానికి సులభంగా శోషించబడతాయి.
బంగాళదుంప( potato ) వేయించి తీసుకోకూడదు.ఉడికించే తినాలి.వేయించిన బంగాళదుంపలో ఎక్కువ కేలరీలు ఉంటే.ఉడకబెట్టడం బంగాళదుంపలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి.
టమోటో కొందరు పచ్చిగా తింటారు.కానీ టమోటో ఉడకబెట్టి తింటే.
అందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువవుతుంది.
గుడ్లను( Eggs ) ఎప్పుడూ ఉడికించే తీసుకోవాలి.ఉడకబెట్టిన గుడ్లు తక్కువ కొవ్వు ఉన్న ఆహారంగా మారుతాయి.మరియు అందులోని ప్రోటీన్ శరీరానికి సులభంగా అందుతుంది.
చికెన్ మరియు ఫిష్ వేయించి కాకుండా ఉడికించి తీసుకోవాలి.అప్పుడే తక్కువ కొవ్వుతో మంచి ప్రోటీన్ ఆహారంగా మారతాయి.
వేపడం లేదా డీప్ ఫ్రై చేసి తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
ఓట్స్, బార్లీ, క్వినోవా ( Oats, barley, quinoa )వంటి ఆహారాలను ఉడకబెట్టి తీసుకోవాలి.దాంతో అవి మృదువుగా మారి జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటాయి.అదే సమయంలో వాటిలోని ప్రోటీన్ మరియు ఫైబర్ సులభంగా శరీరానికి అందుతాయి.
రాగి, జొన్న, గోధుమలను ఉడికించి తింటే త్వరగా జీర్ణం అవుతాయి.మొలకెత్తిన గింజలను నేరుగా కన్నా కొంచెం ఉడికించి తీసుకుంటేనే పీచు సులభంగా జీర్ణమవుతుంది.