IPL Orange Cap : ఈ ఐపిఎల్ లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే సత్తా ఉన్న కుర్ర ప్లేయర్లు వీళ్లే…

ఇక ఈనెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17 వ( IPL 17 ) సీజన్ ప్రారంభం కానుంది.ప్రతి టీమ్ ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

 These Are The Young Players Who Can Win The Orange Cap In This Ipl Details-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఆరెంజ్ క్యాప్( Orange Cap ) గెలిచే ప్లేయర్ ఎవరు అనే దానిమీద సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల కామెంట్లైతే చేస్తున్నారు.ఇక ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ గెలిచే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రుతురాజ్ గైక్వాడ్

Telugu Chennai, Gujarat Titans, Ipl Orange Cap, Orange Cap, Ruturaj Gaikwad, Shu

చెన్నై సూపర్ కింగ్స్ టీం కి కీలకమైన ప్లేయర్ గా మారిన గైక్వాడ్( Ruturaj Gaikwad ) ప్రతి ఐపిఎల్ సీజన్ లో తనదైన రీతిలో పరుగులు చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ టీం కి వరుస విజయాలను అందిస్తూ వస్తున్నాడు.ఇక డేవిన్ కాన్వే తో పాటు ఓపెనింగ్ చేసే గైక్వాడ్ పవర్ ప్లే లోనే భారీ హిట్టింగ్ షాట్స్ కొడుతూ భారీ పరుగులు రాబడుతూ తనకు తానే పోటీ అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు.ఇక ఈసారి ఈయన ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి…

శుభ్ మన్ గిల్

Telugu Chennai, Gujarat Titans, Ipl Orange Cap, Orange Cap, Ruturaj Gaikwad, Shu

ప్రస్తుతం గిల్( Shubman Gill ) మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక టి20 మ్యాచ్ ల్లో తను ఆకాశమే హద్దు గా చెలరేగి ఆడుతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక గత సీజన్ వరకు గుజరాత్ టీమ్ కి ప్లేయర్ గా కొనసాగుతున్న గిల్ ఈ సీజన్ లో ఆ టీమ్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించబోతున్నాడు.ఇక ఈ క్రమంలో ఆయన మీద అదనపు బాధ్యత కూడా పెరగబోతుంది.గత సీజన్ లో 17 మ్యాచ్ ల్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సంపాదించుకున్నాడు.

యశస్వి జైస్వాల్

Telugu Chennai, Gujarat Titans, Ipl Orange Cap, Orange Cap, Ruturaj Gaikwad, Shu

రాజస్థాన్ టీం లో కీలక ప్లేయర్ గా ఉన్న జైశ్వాల్( Yashasvi Jaiswal ) ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక రీసెంట్ గా ఇంగ్లాండ్ తో ఆడిన టెస్టు సిరీస్ లో వరుసగా సెంచరీ, డబల్ సెంచరీలు చేస్తూ తనదైన రీతిలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.ఇక ఐపిఎల్ లో కూడా అదే ఫామ్ ని కొనసాగించాలని చూస్తున్నాడు.ఇక జైశ్వాల్ కి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube