అప్పుడప్పుడు అక్రమార్కుల తెలివి చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదేమో.ఎందుకంటే వారు తమ అక్రమాలను చేసేందుకు ఎంచుకునే మార్గాలు అలా ఉంటున్నాయి మరి.
ఇకపోతే ఇప్పడు మనం చూడబోయే వీడియోను గనక మీరు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును అనే పద్యం గుర్తుకు రాకుండా ఉండదేమో.ఎందుకంటే ఈ వీడియోలో కూడా అక్రమార్కులు ఇలాంటి తెలివినే ఉపయోగించారు.
పైకి పుచ్చకాయలన్నట్టు కలరింగ్ ఇచ్చేసి ఎంచక్కా దారుణాలకు పాల్పడుతున్నారు.అదేంటో తెలుసుకుందాం.
అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ కండ్లను అస్సలు నమ్మలేరేమో.ఎందుకంటే ఈ స్మగ్లర్లు అంత తెలివి మీరిపోయారు మరి.డ్రగ్స్ సరఫరా కోంస టెక్నాలజీని ఓ రేంజ్లో ఉపయోగించేస్తున్నారు.ఇక పోలీసుల కండ్లు గప్పి ఒక చోట నుంచి మరో ఏరియాకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు వారు వేస్తున్న ఎత్తుగడలు చూస్తే మాత్రం నిజంగానే షాక్ అయిపోతారు.
వారు తీసుకెళ్లే వ్యానులో మొత్తం పుచ్చకాయలే ఉంటున్నాయి.అయితే అవి పుచ్చకాయల లోడ్ అని భావించిన పోలీసులు వదిలేస్తే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగేది.
కానీ పోలీసులు వారికంటే ఎక్కువ తెలివైన వారు కదా అందుకే వాటిని కట్ చేసి చూస్తే అసలు విషయం బయట పడింది.కాగా ఈ స్మగ్లింగ్ ఎక్కడ జరిగిందో వివరాలు స్పష్టంగా తెలియకున్నా గానీ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.ఆ లారీలో ఉన్న పుచ్చకాయలను ఎందుకో అనుమానం వచ్చి కోస్తున్నట్లు మన చూడవచ్చు.కాగా వారు అలా కోయగానే అందులో ఒక ప్యాకెట్ ఉంది.ఇక దాన్ని కూడా పోలీసులు కట్ చేసి చూడగా అందులో నుంచి గంజాయి బయటపడింది.ఈ విధంగా స్మగ్లర్లు తెలివి చూపించేస్తున్నారు.