తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్( Ram Charan ) లాంటి స్టార్ హీరో కూడా వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది.
కాబట్టి దీని తర్వాత బుచ్చిబాబు( Buchi Babu Sana ) డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే ఈ సినిమాలో జాహ్నవి కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలా ను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో బుచ్చిబాబు సనా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే శ్రీలీలా కి కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది.
ఆమె కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీలా మెయిన్ హీరోయిన్ గా నటించింది.
అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయింది.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఆమెకు కెరియర్ పరంగా చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో క్యారెక్టర్ కి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు బుచ్చిబాబు సనా ఇద్దరు పాన్ ఇండియాలో మరోసారి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…
.