కాంగ్రెస్ లో చేరేందుకు నాయకుల క్యూ ! పెరుగుతున్న అనుమానాలు 

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపు వచ్చింది.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకోవడం ఆ పార్టీలో ఉత్సాహం కలిగిస్తోంది.

 The Queue Of Leaders To Join The Congress Growing Suspicions , Telangana Congr-TeluguStop.com

ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్, బిజెపిల ( BJP )నుంచి ఈ చేరుకలు చోటు చేసుకుంటూ ఉండడం కాంగ్రెస్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.ఈ స్థానాన్ని బిజెపి ఆక్రమించినా , ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఉండడంతో , కాంగ్రెస్( Congress party ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా ఏఐసిసి పెద్దల నిర్ణయాలు మేరకు తెలంగాణలో రాజకీయ ఎత్తుగడలు అమలు కాబోతున్నాయి.

ఇక పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటు వంటి విషయాలను పక్కనపెట్టి చేరికలపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట.

Telugu Brs, Congress, Revanth Reddy, Telangana Bjp-Politics

 ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సర్వేల ఆధారంగా అభ్యర్థుల ప్రకటన ఉండబోతున్నట్లు ఆ పార్టీ కీలక నాయకులు చెబుతున్నారు.ఇప్పుడే సీట్ల గురించి హామీలు ఇస్తే తర్వాత ఇబ్బందులు ఏర్పడతాయని భావిస్తున్నారట .ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,  ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.వీరే కాకుండా మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు , నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీలోకి వస్తామని సంకేతాలు పంపిస్తుండడంతో,  కాంగ్రెస్ ఆలోచనలో పడింది అధికార పార్టీ నుంచి వస్తున్నారని వెంటనే చేర్చుకోవడం కంటే , సదరు నాయకులు కాంగ్రెస్ లో చేరాలనుకోవడానికి కారణాలు ఏమిటి ?  వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న బలం ఎంత ?  నిజంగానే బీఆర్ఎస్ లో విసిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు లేక మరి ఏదైనా కారణంతో చేరుతున్నారా అనే విషయాల పైన సమగ్రంగా వివరాలు సేకరించి అప్పుడు చేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుందట.

Telugu Brs, Congress, Revanth Reddy, Telangana Bjp-Politics

 పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు బీఆర్ఎస్( BRS party ) సీనియర్ నాయకులు , ఒక ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట వీరిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్రంలో ప్రాతినిధ్యం కోరుతున్నట్లు సమాచారం.అధికార పార్టీ బీఆర్ఎస్ లో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కే అవకాశం లేకపోవడంతో సదర నాయకుడు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాలనుకున్న నాయకుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని,  ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube