అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగుకి ఈ మధ్య కాలంలో భారీగా డిమాండ్ ఏర్పడింది.రోజు రోజుకి తెలుగు నేర్చుకోవాలనే కోరిక ఉన్నావారు రెట్టింపు అవుతున్నారు.ఈ ఎవరో చెప్పింది కాదు అమెరికాకి చెందిన
సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ ఈ సర్వే నిర్వహించింది…అయితే ఇందులో ఎంతో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.2010 నుంచి 2017 మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడే గణనీయంగా 86 శాతం మేర పెరగడం విశేషం.వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన ఆన్‌లైన్ వీడియో ఈ సర్వే వివరాలను వెల్లడించింది.
ఇదిలాఉంటే అమెరికాలో ఎక్కువగా మాట్లాడుతున్న భారతీయ భాషల్లో తెలుగు మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో భాగంగా ఇంగ్లిష్ కాకుండా ఇతర భాష మాట్లాడేవాళ్లను బట్టి ఈ అంచనా వేశారు.అమెరికాలో గతేడాది 4 లక్షల వరకు తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.
2010తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం విశేషం.ఇక అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మొదటి పది భాషల్లో ఏడు దక్షిణాసియాకు చెందినవే ఉన్నట్లు గుర్తించారు.
అయితే హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భారీగా అమెరికాకు వలస వెళ్తుండటంతో అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోందని “తెలుగు పీపుల్ ఫౌండేషన్” అనే సంస్థ ఫౌండర్ ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు.మొత్తం అమెరికా జనాభా 32 కోట్లు కాగా.
అందులో సుమారు 6 కోట్ల మంది ఇంగ్లిష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడేవాళ్లు ఉన్నారు.