అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోందట అంతేకాదు చాలా మంది అమెరికన్స్ సైతం తెలుగు నేర్చుకోవాలని తహతహలాడుతున్నారట.అమెరికాలో కొలువుల కోసమే ఆర్ధికంగా స్థిరపడటం కోసమో లేక చదువుల కోసమే.
ఉద్యోగ వ్యాపారాల కోసమే ఇలా అనేక రకాలుగా ఎన్నో రంగాలని ఎంచుకుని జీవనం సాగిస్తూ ఉంటారు తెలుగువారు.ఈ క్రమంలోనే ఎంతో మంది తెలుగు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు.అంతేకాదు
అక్కడ తెలుగు వారు అందరూ కలిసి అనేక సంఘాలని ఏర్పాటు చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.అంతేకాదు రాజకీయ రంగాలలో కూడా ఎలుగు వారు అత్యన్నత స్థానాలు అధిరోహించారు అంటే తెలుగు వారి ప్రాభల్యం ఎరేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా అమెరికా జనాభా లెక్కల విభాగం ద సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) సంస్థ సంయుక్తంగా ఆ దేశంలోని ప్రవాసీయులు ఏయే భాషలను ఎక్కువగా వినియోగిస్తున్నారో లెక్కించాయి.
ఈ లెక్కింపులో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో తెలుగు ప్రజలు మూడో స్థానంలో ఉన్నారు.వారిలో హిందీ మాట్లాడేవారు మొదటిస్థానంలో ఉండగా గుజరాతీలు రెండో స్థానంలో ఉన్నారు…అయితే 2010-2017 మధ్య తెలుగు ప్రజల సంఖ్య ఏకంగా 86 శాతం పెరగడంతో దాదాపు తెలుగు మాట్లాడే వారి 4.15 లక్షల మందికి చేరిందని అధికారులు తెలిపుతున్నారు.
.