కృష్ణతులసి సీరియల్ లో నటిస్తున్న హీరో నాగార్జున.. రౌడీలను చితగొట్టి.. వామ్మో?

బుల్లితెరపై ప్రస్తుతం సీరియల్స్ హవా బాగా నడుస్తుందనే చెప్పవచ్చు.ఈ సీరియల్స్ హవా అనేది ముందు తరాల నుంచి వస్తూనే ఉంది.

 The Hero Nagarjuna Act In The Krishnathulasi Serial, Krishna Thulasi, Daily Seri-TeluguStop.com

ప్రస్తుతం వెండితెర కంటే ఎక్కువగా బుల్లితెరపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.నిజానికి సీరియల్స్ కి బాగా ఆకర్షితులవుతున్నారు.

సీరియల్ సమయం ప్రారంభం కాగానే సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆ సమయంలో ఎన్ని పనులు ఉన్నా వదులుకొని మరి చూస్తున్నారు.

ఇక సీరియల్స్ లలో చాలా తక్కువ సందర్భాల్లో సినిమా హీరోలు వచ్చి కూడా చిన్న పాత్ర తో సందడి చేస్తారు.

కొన్ని కొన్ని సార్లు సినిమాటికల్ స్టైల్స్ కూడా సీరియల్స్ లో కనిపిస్తూ ఉంటాయి.నిజంగా సీరియల్ డైరెక్టర్లు కూడా కొన్నిసార్లు ఎడిటింగ్ ద్వారా కూడా కథను మలుపు తిప్పుతుంటారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా వెండితెర స్టార్ హీరో నాగార్జున బుల్లితెర సీరియల్ లో కూడా అడుగు పెట్టాడు.

Telugu Serial, Krishna Thulasi, Nagarjuna, Tollywood-Movie

అదేంటి నాగార్జున ఏంటి.ఆయన సీరియల్లో నటించడం ఏంటి అని అనుకుంటున్నారా.మీరు విన్నది నిజమే.

పైగా దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.ప్రస్తుతం బుల్లితెరపై చాలా సీరియల్స్ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.

అందులో కృష్ణ తులసి సీరియల్ కూడా ఒకటి.ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతుంది.

ఇక ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం కూడా ఉంది.

పైగా ఇందులో నటించిన నటీనటులకు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సీరియల్ గత ఏడాది ప్రారంభం కాగా.ఈ సీరియల్ కు మీర్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రతిరోజు ఈ సీరియల్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో బాగా రుచి చూపిస్తాడు డైరెక్టర్.ఇక ఇందులో శ్యామ, అఖిల్ అనే పాత్రలు కీలకపాత్రలు కాగా.

తాజాగా వీరికి హీరో నాగార్జున సపోర్ట్ అందింది.

తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల కాగా.

అందులో అఖిల్ ను కొంతమంది రౌడీలు కొడతారు.ఆ సమయంలో శ్యామ కూడా కింద పడిపోతుంది.

దీంతో ఆ సమయంలో నాగార్జున.ఆత్మ గా ఎంట్రీ ఇచ్చి అఖిల్ శరీరంలో దూరి రౌడీలను చితగ్గొట్టాడు.

అంతే కాకుండా శ్యామతో కాస్త రొమాన్స్ చేస్తున్నట్లు కూడా చూపించారు.

Telugu Serial, Krishna Thulasi, Nagarjuna, Tollywood-Movie

ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారగా.నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్లు పెడుతున్నారు.బంగార్రాజు సినిమాలోని నాగార్జున ని బాగానే ఎడిట్ చేసి అఖిల్ శరీరంలోకి బాగానే దూర్చారు కదా అంటూ తెగ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు ప్రేక్షకులు అంత వెధవలా కనిపిస్తున్నారా.మరి ఇంతా.ఎడిటింగ్ చేస్తే డైరెక్టర్ ఎందుకు.మొత్తం ఎడిటర్స్ నే పెట్టుకోవచ్చు కదా అని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube