వైరల్‌ వీడియో: పబ్లిక్‌ లో స్కూటర్‌పై రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన జంట.. చివరకు..

ఈ మధ్యకాలంలో చాలామంది యువత పిచ్చి వేషాలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.మరికొందరు తాము పబ్లిక్ లో ఉన్నామని మరిచిపోయి రొమాన్స్ చేయడం కూడా మొదలుపెట్టేశారు.

 Viral Video A Couple Who Got Excited While Romancing On A Scooter In Public Fin-TeluguStop.com

ఇందుకు సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.తాజగా ఇలాంటి సంఘటన మరొకటి జరగగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్( Gujarat ) లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

గుజరాత్ రాష్ట్రంలోని ఓ నగరంలో రాత్రిపూట పబ్లిక్ రోడ్డుపై స్కూటర్ లో వెళ్తున్న సమయంలో ఇద్దరు పబ్లిక్ గా రొమాన్స్ చేసుకోవడం వైరల్ వీడియో( Viral video )లో కనపడుతుంది.ఈ నేపథ్యంలో వారు వెళుతున్న స్కూటర్ వెనకాల ఉన్న మరో వ్యక్తి వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఇక ఒకే స్కూటర్పై ఇద్దరు మగవారు, ఒక అమ్మాయి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ముందర బైక్ డ్రైవ్ ( Bike drive )చేస్తుండగా., మధ్యలో ఉన్న వ్యక్తి వెనుక అమ్మాయిల వైపు తిరిగి కూర్చున్నాడు.

అలా ఎదురుగా కూర్చున్న వారిద్దరూ హద్దులు దాటి మరి పబ్లిక్ లో ఉన్న విషయాన్ని మరిచిపోయి ముద్దులతో చెలరేగిపోయారు.

ఈ వైరల్ గా మారిన వీడియోని చూసిన సోషల్ మీడియా ( Social media )నెటిజన్స్ వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.పబ్లిక్ లో వెళ్తున్న అని సోయకూడ లేకుండా ఇలా బరితెగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube