మెగా ఫ్యామిలీ ఒకే చోట పండుగలను సెలెబ్రేట్ చేసుకోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఈయన ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి నేడు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.

 Thats The Reason Why Mega Family Celebrate Every Festival Together Megastar, Meg-TeluguStop.com

ఇలా ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో తన కష్టంతో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి చిరంజీవి గారు ఎంత ఎదిగిన ఓదిగి ఉండే మనస్తత్వం కలవారని మనకు తెలిసిందే.

ఇక నటన పరంగా ఎవరికైతే మంచి ఇష్టం ఉంటుందో అలాంటి వారిని బాగా ప్రోత్సహిస్తూ వారిని కూడా ఉన్నత స్థాయికి చేరుస్తూ ఉంటారు అలాగే ఆ హీరోల సినిమాలకు కూడా ఈయన తన సపోర్ట్ ఇస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ను అందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కలిసి ఒక చిట్ చాట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేసినటువంటి ఈ చిట్ చాట్ లో భాగంగా విజయ్ దేవరకొండ చిరంజీవిని ఎన్నో ప్రశ్నలు వేశారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఆయనని ప్రశ్నిస్తూ మీరు ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత మీరు స్టార్ హీరోగా మారిపోయారు పద్మ భూషణ్, పద్మ విభూషన్ ( Padma Bhushan, Padma Vibhushan )వంటి గొప్ప అవార్డులను అందుకున్నారు.అందరికీ మీరు ఒక ఐడియల్ పర్సన్ గా మారిపోయారు.

అయితే మీరు ఈ హోదాలను అందుకోకముందు మీకు ఫ్యామిలీ స్టార్ ఎవరు అనే ప్రశ్న వేశారు.

Telugu Chiranjeevi, Tollywood-Movie

నా ఫ్యామిలీ స్టార్ మా నాన్న అని చెప్పారు.తన తండ్రి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు అందరిని ఎలా కలుపుగోలుగా వెళ్లాలి బంధాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాలను నేను నాన్న నుంచి నేర్చుకున్నానని తెలిపారు.అందుకే కుటుంబాన్ని ఇలాగే కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ప్రతి పండుగలకు తన కుటుంబం మొత్తాన్ని ఒకే చోట చేర్చి సెలెబ్రేట్ చేసుకుంటామని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.

Telugu Chiranjeevi, Tollywood-Movie

ఒక మనిషికి మనిషికి అన్న తర్వాత ఎన్నో రకాల విభేదాలు ఉండవచ్చు కానీ ఇలా అందరూ ఒకే చోట కలిసి ఒక పండుగను జరుపుకున్నాము అంటే వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి అలాగే బంధాలు బలపడతాయి.మొన్న బెంగళూరులో మా కుటుంబం మొత్తం జరుపుకున్నటువంటి సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటో చాలామందిని ఇన్ఫ్లుయన్స్ చేసిందని తెలిపారు అమెరికా వెళ్లిన తర్వాత అంత బిజీ షెడ్యూల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మూడు రోజుల పాటు ఒకే చోట ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు అంటూ అందరూ ఆశ్చర్యపోయారని ఆ ఫోటో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటూ ఈ సందర్భంగా చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube