తెలంగాణలో రాబోయే పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే( Congress Govt ) అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తెలిపారు.
సికింద్రాబాద్ ఎంపీ సీటు లక్ష మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నారు.అధికారం పోయిన మూడు నెలలకే బీఆర్ఎస్( BRS ) పతనం మొదలైందని చెప్పారు.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) సికింద్రాబాద్ కు చేసింది ఏమీ లేదని విమర్శించారు.ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి సిటీ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.మూసీ ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ మాట తప్పారన్న కోమటిరెడ్డి రూ.40 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.