ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లియో.( Leo ) తమిళ స్టార్ హీరో విజయ్( Hero Vijay ) ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
దసరా పండుగ కానుకగా ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించి కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మరి ఏ సెలబ్రిటీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు లియో కోసం పెట్టారు.అయితే ఇందులో సగం బడ్జెట్ చిత్రబృందం రెమ్యునరేషన్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఎందుకంటే హీరో విజయ్ రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నాడట.డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రూ.10 కోట్లు, సంజయ్ దత్( Sanjay Dutt ) రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు, అర్జున్ రూ.కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు తీసుకున్నారట.సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వామ్మో హీరో విజయ్ ఏకంగా అన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడా అంటూ నెటిజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు.ఇకపోతే దసరా బరిలో ఉన్న మరో రెండు సినిమాల విషయానికి వస్తే.ఒకటి బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) కాగా మరొకటి టైగర్ నాగేశ్వరరావు.
( Tiger Nageswara Rao ) వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ఓటీటీ లో థియేటర్లలో విడుదల అవుతున్నాయి.ఈ మూడింటిలో ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్న సినిమా లియోనే కావడం విశేషం.
మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.