అమెరికాలో తెలుగువారు ఎంతో మంది వివిధ రంగాలలో రాణిస్తున్నారు కొంటామని వ్యాపారాలని వృద్ది చేసుకుంటూ అత్యన్నతమైన స్థితికి చేరుకుంటే మరికొందరు ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో స్థిరపడ్డారు అయితే వీరందరూ ఒక్కటిగా ఏర్పడి ఎన్నో తెలుగు సంఘాలని ఏర్పాటు చేసుకున్నారు.అమెరికాలో విదేశీయులు ఏర్పాటు చేసుకున్న వివిధ సంఘాలలో తెలుగు సంఘాలు ఎంతో కీలకంగా ఉంటాయి.
ఈ సంఘాలలో ముఖ్యంగా ఉత్తర అమెరికాకి తెలుగు సంఘం అయిన నాట్స్ ఎంతో గుర్తింపు పొందింది.అమెరికాలో తెలుగువారికి అండగా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేయండంలో ఎప్పుడూ ముందు ఉంటూనే ఉంటుంది.అయితే తాజాగా అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం భారీ విరాళాన్ని అందించి మరో సారి నాట్స్ గొప్ప మనసుని చాటుకుంది….రెండు నెలల క్రితం సెయింట్ లూయిస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చాలామంది తెలుగువారు తమ ఆస్తులను నష్టపోవాల్సి వచ్చింది.
అయితే ఆ అగ్నిప్రమాదంలో నష్టపోయిన తెలుగువారికి సాయం అందించాలని బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ పిలుపునిచ్చింది.స్పందించిన నాట్స్ సభ్యులు తమవంతు చేయూత అందించారు…దాంతో నిధుల సేకరణ ప్రారంభించి మొత్తం 7500 డాలర్ల మొత్తాన్ని పోగుచేశారు ఈ మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించారు.ఈ కార్యక్రమంలో నాట్స్ టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు.