తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 27 ఆదివారం, 2020

Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 Sunday 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam)

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 27 Sunday 2020-TeluguStop.com

సూర్యోదయం: ఉదయం 05.57

సూర్యాస్తమయం:సాయంత్రం 05.59

రాహుకాలం: సా.04.29 నుంచి 05.59 వరకు

అమృత ఘడియలు:ఉ 09.50 నుంచి 11.31 వరకు

దుర్ముహూర్తం: సా 04.23 నుంచి 05.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి.దాని వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాస్త సమయస్ఫూర్తితో పనులు మొదలు పెడితే మంచి జరుగుతుంది.ఈ రోజు చివరన మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

వృషభం:

రాశివారు ఆరోగ్య విషయం పై జాగ్రత్త వహించాలి.ఈరోజు మీరు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి.

మిథునం:

రాశి వారికి ఈరోజు విపరీతంగా ఖర్చులు అవుతాయి.మీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు విషయంలో ఆలోచించి చేయండి.స్థిరాస్థి కి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి వీటిని జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు మీ ఇంటికి అనుకోని మిత్రులు వచ్చి వెళ్తారు.

కర్కాటకం:

రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కాస్త ఆలోచించి ఖర్చు చేయండి.మాట్లాడే మాటలను అదుపులో ఉంచుకుంటే ఈ రోజును ఆనందంగా గడుపుతారు.

సింహం:

రాశి వారికి తమ పని విధానంలో ఎక్కువగా ఒత్తిడి కనిపిస్తుంది.ఏదైనా విషయంలో తొందర పడితే మీ పై అధికారులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.కావున ప్రశాంతతో పనులు పూర్తి చేయండి.మీ సమస్యలను తెలివిగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.

కన్య:

రాశి వారు ఈరోజు సంతోషంగా గడిపిన.అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.మీ ఇంటికి ఊహించని అతిథి వచ్చి కలుస్తారు.మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

తులా:

రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి.కావున ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా చేయండి.ఈరోజు మీరు మీ కుటుంబం తో ఆనందం గా గడుపుతారు.

వృశ్చికం:

రాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారులు లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.ఎవరైనా మిమ్మల్ని అప్పుగా అడుగుతే తొందరపడి ఇవ్వకండి.అప్పుడే ఎటువంటి సమస్యలు రావు.మీ భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటారు.

ధనస్సు:

రాశి వారికి ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొనడం తో మనశ్శాంతి లేకుండా ఉంటారు.మీ పిల్లల విద్యాభివృద్ధి మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది.నమ్మకస్తుల సాయంతో గతంలో పెట్టిన మీ ధనంను తిరిగి పొంది సంతోషంగా గడుపుతారు.

మకరం:

రాశి వారికి తాము చేసే పనులలో ఒత్తిడి ఉండడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు.వ్యాపార విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి…లేదా నష్టపోతారు.ధ్యానం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది.

కుంభం:

రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉంది.ఆర్థిక సమస్యలు మెరుగు పరచడానికి అనుకూలంగా ఉంది.మీ పైవారితో వ్యాపారం కు సంబంధించిన సమాచారం, సలహాలు తెలుసుకుంటారు.తోటి ఉద్యోగుల తో ప్రశంసలు అందుకుంటారు.మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

మీనం:

రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంది.ఆర్థిక పరమైన ఇబ్బందులు గాని మరేతర సమస్యలు లేవు.ప్రశాంతతను కలిగి ఉంటారు.

వ్యాపార విషయాలలో పెట్టుబడి పెట్టె ముందు మీ కుటుంబ పెద్దవారితో సలహా తీసుకోవడం మంచిది.

#TeluguDaily #Daily Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube