ఆర్టీసీ యూనియన్‌లు ఉండాలా? వద్దా?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు చేసిన సమ్మెను విరమించడంతో కేసీఆర్‌ వారిపై వరాల జల్లు కురిపించిన విషయం తెల్సిందే.ఇన్ని రోజులు మీరు కార్మిక సంఘాలు మరియు కొందరు నాయకుల వల్ల మోసపోయారు.

 Telangana Rtc Jac Chairman Comments On Rtc Union-TeluguStop.com

ఇకపై మీరు కార్మిక సంఘాలను నమ్మవద్దని, మీరు ఇకపై కార్మిక సంఘాల్లో ఉండవద్దంటూ కేసీఆర్‌ సూచించాడు.నేను మీ కోసం ఉన్నాను.

మీకు కష్టం వస్తే నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చాడు.ఇకపై కార్మిక సంఘాలు ఉండకూడదు అంటూ సూచించాడు.

కార్మిక సంఘాలు ఉండకూడదు అంటూ కార్మికులు అందరు కూడా అనుకుంటేనే కార్మిక సంఘాలను రద్దు చేయాలని, లేదంటే కొనసాగించాల్సిందే అంటూ కార్మిక సంఘాల నాయకుడు అశ్వద్థామ రెడ్డి అన్నాడు.ఈ విషయమై రహస్య ఓటింగ్‌ జరిగి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని, కాని ఆర్టీసీ కార్మికులతో బలవంతంగా సంతకాలు తీసుకుంటూ సంఘాలు అక్కర్లేదు అని వారితో చెప్పిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సీఎం కేసీఆర్‌ హామీలను అధికారులు నెరవేర్చడం లేదని, సమ్మె సమయంలో కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ జరపాల్సిందే అంటే ఈ సందర్బంగా ఆయన డిమాండ్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube