టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో కుమారుడిని పోటీలోకి దింపి పక్కకు తప్పుకున్న జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక.అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సైలెంట్ అయిపోయారు.ఎక్కడా కూడా ఏపీ రాజకీయాల గురించి పెద్దగా ప్రస్తావించలేదు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లోపలికి వెళ్లడానికి జేసీ దివాకర్ రెడ్డి బుధవారం ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.
అపాయింట్మెంట్ లేనిదే లోపలికి పంపే ప్రసక్తి లేదని జేసీ దివాకర్ రెడ్డికి నిర్మొహమాటం లేకుండా చెప్పేశారు.
దీంతో పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న అనంతరం ఏమి చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.గతంలోనూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి ఈ తరహాలోనే వెళ్లగా… తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా తాజాగా ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులతో వాగ్వాదం డిస్కషన్ జరగడం.2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.