శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న కవిత దంపతులకు ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.
అనంతరం మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులు దర్శనంతరం అమ్మవారి వేద ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్సీ కవిత దంపతులకు అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపట జ్ఞాపికను, శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు.
ఎమ్మెల్సీ కవిత దంపతులతో పాటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం స్వామి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.ఇరు రాష్ట్రల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీశైలం బాగా అభివృద్ధి జరిగిందని తిరుమల తరహాలో అభివృద్ధి చెందుతుందని అలానే ఆర్జితసేవలలో కూడా తెలంగాణ నుండి ఎదో ఒకసేవలలో భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు.