తెలంగాణ పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజ్ విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెల్సిందే.మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్రాన్ని అస్థిర పర్చడం కోసం.ప్రభుత్వాన్ని పడదోయడం కోసం ఎన్ని మార్గాల్లో అయినా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని దీంతో నిరూపితం అయింది అంటూ బీఆర్‌ఎస్ పార్టీ( BRS party ) నాయకులు ఆరోపించారు.
తాజాగా బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( MLA Balka Suman )సంచలన ఆరోపణలు చేశారు.ఈ కేసులో బీజేపీ ముఖ్య నేతల పేర్లు బయటకు రాబోతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఢిల్లీ పెద్దలది అంటూ బాల్క సుమన్ ఆరోపించారు.తెలంగాణ లో వాళ్లకు చోటు దక్కడం లేదనే ఉద్దేశ్యంతో ప్రస్టేషన్ తో ఇలాంటి ప్రచారం చేస్తు ఉన్నారంటూ బాల్క సుమన్ ఆరోపించాడు.పేపర్ లీకేజీ ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం.తద్వారా ప్రభుత్వంను అస్థిర పర్చడం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న విద్యార్థులకు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బాల్క సుమన్ డిమాండ్ చేశారు.ఈ కేసులో దోషులుగా నిర్థారణ అయ్యే ఏ ఒక్కరిని కూడా విడిచి పెట్టేది లేదు అంటూ బాల్క సుమన్ హెచ్చరించారు.
ప్రతి ఒక్కరు కూడా విచారణ ఎదుర్కొని దోషి అని తేలితే శిక్ష అనుభవించాలంటూ బాల్క సుమన్ కోరుకుంటున్నాను అన్నాడు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా పలువురు కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు.